కరోనా మహమ్మారి ప్రభావం మొదలవడానికి ముందు విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలోకి దిగాల్సిన పరిస్థితుల్లో ‘వి’, ‘ఉప్పెన’, ‘రెడ్’ లాంటి చిత్రాలకు కరోనా వల్ల బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని చూశారు కానీ.. ఇలా నెలలకు నెలలు వేచి చూపులు తప్పవని ఊహించలేకపోయారా నిర్మాతలు.
మధ్యలో ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా.. అది తమకు గిట్టుబాటు కాదని ఆగిపోయారు. పైగా ఇవన్నీ ఓ స్థాయి ఉన్న సినిమాలే. థియేటర్లలో రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఆ చిత్రాలకు. ఆరు నెలలు ఆలస్యంగా అయినా థియేటర్లలోనే వీటిని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆగస్టు సమయానికి థియేటర్లు తెరుచుకుని బొమ్మ పడుతుందనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు.
దసరాకు థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడిచినా గొప్పే అన్నది ప్రస్తుత పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరోసారి పై సినిమాల ఓటీటీ రిలీజ్ గురించి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి టెంప్టింగ్ ఆఫర్ వచ్చిందని.. ఇంకెంతో కాలం వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు.
అటు ప్రైమ్ నుంచే కాక.. అల్లు వారి ‘ఆహా’ నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చిందని.. వరుసగా ఓటీటీ సినిమాలు నిరాశ పరుస్తుండటం.. వాటికి స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల ఓటీటీ రిలీజ్‌ల విషయంలో నెగెటివ్ ఫీలింగ్‌తో ఉన్న ప్రేక్షకుల ఆలోచన మార్చడానికి ‘వి’ లాంటి పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉత్సాహం చూపిస్తున్నాయని అంటున్నారు. హిందీలో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ల సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో మన దగ్గర నాని సినిమా అలా రిలీజైతే ఆశ్చర్యమేమీ లేదేమో.
This post was last modified on July 4, 2020 8:07 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…