నిఖిల్-చందూ మొండేటిల కొత్త చిత్రం ‘కార్తికేయ-2’ జులై 22నే విడుదల కావాల్సిందే. ఆ డేట్‌ను అంతకు రెండు నెలల ముందే ప్రకటించింది చిత్ర బృందం. కానీ సినిమా ఆ సమయానికి రెడీ అయినా సరే.. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆగస్టు 5కు అనుకుంటే ఆ డేట్‌నూ మార్చక తప్పలేదు. ఆగస్టు 12కు ఫిక్స్ అయ్యాక కూడా ఒక రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. తన సినిమాను ఇలా మళ్లీ మళ్లీ వాయిదా వేయాల్సి రావడంపై నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే.
తమ సినిమా డేట్ మార్చుకోవాలని ఒత్తిడి రావడంతో తాను చాలా రోజులు ఏడ్చినట్లు నిఖిల్ చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో. ఐతే ఏం జరిగినా మన మంచికే ఈ సినిమాను వాయిదా వేయడం మంచిదే అయిందని చెప్పాలి. జులై 22న ఈ సినిమా వచ్చుంటే.. అప్పుడు ప్రేక్షకులు ఉన్న మూడ్‌లో ఈ సినిమాను ఏమాత్రం ఆదరించేవారన్నది సందేహమే. జులై నెల భారీ వర్షాలు ముంచెత్తాయి. పైగా జనాలు ఎందుకో సినిమాలు చూసే మూడ్‌లోనే కనిపించలేదు.
ఇక ఆగస్టు 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లు రాబట్టాయి. వాటితో పోటీ పడి ఉంటే ‘కార్తికేయ-2’కు మైనస్ అయ్యేది. తర్వాతి వారం వచ్చిన మాచర్ల నియోజకవర్గం, లాల్ సింగ్ చడ్డా దారుణంగా బోల్తా కొట్టడంతో ఫోకస్ మొత్తం ‘కార్తికేయ-2’ మీదికి మళ్లింది. ఆమిర్ ఖాన్ చిత్రం మీద ఉన్న నెగెటివిటీ వల్ల హిందీ ప్రేక్షకులు ఇప్పుడు ‘కార్తికేయ-2’ వైపు మళ్లుతున్నారు.
ఇక ‘కార్తికేయ-2’కు సెలవులు కూడా బాగా కలిసొస్తున్నాయి. సోమవారం ఇండిపెండెన్స్ డే లీవ్ ప్లస్ అయింది. ఈ శుక్రవారం జన్మాష్టమి రావడం.. సినిమాలో శ్రీ కృష్ణుడి గురించి గొప్పగా చూపించడంతో టైమింగ్ కూడా బాగా కలిసొచ్చింది. ఉత్తరాది ప్రేక్షకులు జన్మాష్టమి సెలబ్రేషన్లలో భాగంగా ఇంకా ఎక్కువగా ఈ సినిమా చూస్తున్నారు. ఈ వారం కొత్త సినిమాలన్నీ నామమాత్రం కావడం కూడా ‘కార్తికేయ-2’కు ప్లస్ అయి అది బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది. ఇలా ఏం జరిగినా మన మంచికే అనే సామెత ‘కార్తికేయ-2’ విషయంలో నిజం అనిపిస్తోంది.
This post was last modified on August 19, 2022 11:59 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…