Categories: Movie News

స్టార్ డైరెక్ట‌ర్ల‌కు చిరు క‌నిపించ‌ట్లేదా?

మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు త‌న అబిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చాడు. అగ్ర ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య పూర్తి చేశాక త‌న సినిమాల లైన‌ప్ గురించి ఆయన చెప్పిన మాట‌లు ఎవ్వ‌రికీ రుచించ‌డం లేదు. లూసిఫ‌ర్ రీమేక్‌ను సాహోతో డిజాస్ట‌ర్ ఫ‌లితాన్నందుకున్న సుజీత్ చేతిలో పెడుతుండ‌టం మీదే కొంత అభ్యంత‌రాలున్నాయి. ఐతే అది రీమేక్ కాబ‌ట్టి కొంత స‌ర్దుకోవ‌చ్చు. కానీ ఆ త‌ర్వాత బాబీ, మెహ‌ర్ ర‌మేష్‌ల‌తో సినిమాలు చేసే అవ‌కాశ‌మున్న‌ట్లు చిరు చెప్ప‌డ‌మే షాకింగ్.

బాబీకి ద‌ర్శ‌కుడిగా ఎప్పుడూ అంత ‌మంచి పేరు లేదు. ప‌వ‌ర్, జై ల‌వ‌కుశ బాగానే ఆడిన‌ప్ప‌టికీ.. అత‌ను ఈ ట్రెండుకు త‌గ్గ ద‌ర్శ‌కుడు కాద‌న్న అభిప్రాయం జ‌నాల్లో ఉంది. చివ‌ర‌గా బాబీ తీసిన వెంకీ మామ చాలా ముత‌క‌గా అనిపించింది జ‌నాల‌కు. చిరుతో బాబీ చర్చ‌లని వార్త‌లొచ్చిన‌పుడే అత‌డితో సినిమా ఏంటి అని అభిమానులు చ‌ర్చించుకున్నారు. అది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు మెహ‌ర్ ర‌మేష్ కూడా త‌నతో సినిమా తీసేందుకు లైన్లో ఉన్నాడ‌ని చిరు చెప్ప‌డం పెద్ద షాక్.

చిరుతో సినిమా అంటే ద‌ర్శ‌కులు కూడా లైఫ్ టైం ఛాన్స్ అనే అనుకుంటారు. అగ్ర ద‌ర్శ‌కుల ఫీలింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఐతే ఈ త‌రం ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించే సినిమాలు తీయ‌గ‌ల అగ్ర ద‌ర్శ‌కులు చాలామంది ఉన్నా చిరు.. మెహ‌ర్ ర‌మేష్ లాంటి ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇవ్వడానికి చూస్తున్నాడంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

రాజ‌మౌళికి ఇప్పుడిప్పుడే ఖాళీ లేక‌పోవ‌చ్చు. కానీ సుకుమార్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ లాంటి, హ‌రీష్ శంక‌ర్, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి డైరెక్ట‌ర్లు చిరుతో సినిమా చేసేందుకు ముందుకొచ్చి చిరు నుంచి క‌మిట్మెంట్ తీసుకోక‌పోవ‌డం.. చిరు కూడా ఇలాంటి ద‌ర్శ‌కుల మీద దృష్టిసారించ‌క‌పోవ‌డమేంటో అర్థం కావ‌డం లేదు.

This post was last modified on April 22, 2020 1:39 pm

Share

Recent Posts

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

55 minutes ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

4 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

5 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

11 hours ago

కొడతావా… కొట్టుకో

ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో దేశ…

11 hours ago