ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే మహేష్ బాబు 28వ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కేవలం ఏడు నెలల టైంలో చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్లు ప్రమోషన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు వగైరా చేయడమంటే చిన్న విషయం కాదు. అయితే అల వైకుంఠపురములో తర్వాత బోలెడం సమయం దొరకడంతో స్క్రిప్ట్ ని పక్కాగా ఫైనల్ చేసుకున్న త్రివిక్రమ్ షెడ్యూల్స్ తో సహా మొత్తం ప్లాన్ చేసుకుని పక్కా టార్గెట్ తో టైంకి ఫినిష్ చేయబోతున్నారు.
ఇక డేట్ విషయానికి వస్తే ఏప్రిల్ 28కి గతంలో ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ అలా కనెక్ట్ చేసుకుంటున్నారు కానీ నిజానికి ఆ తేదీకి పెద్ద చరిత్రే ఉంది. ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టిన ‘బాహుబలి 2 ది కంక్లూజన్’ వచ్చింది 2017లో ఈ రోజే. టాలీవుడ్ కమర్షియల్ సినిమాకు కొత్త గ్రామర్ నేర్పించి కోటి రూపాయల వసూలు చాలా తేలికని నిరూపించిన స్వర్గీయ ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ 1977లో వచ్చింది కూడా ఏప్రిల్ 28. అప్పటి చరిత్ర తాలూకు ప్రకంపనలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి
అలీ లాంటి కమెడియన్ తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ‘యమలీల’ రిలీజ్ కు ఎంచుకున్న ముహూర్తం 1994 ఏప్రిల్ 28. హలో బ్రదర్, భైరవ ద్వీపంల పోటీని తట్టుకుని మరీ గెలిచిన అద్భుతమది. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో మైలురాయి ‘అనార్కలి’ 1955లో వచ్చింది కూడా ఇదే డేట్ కే. ఇలా దీని వెనుక ఇన్ని విశిష్టతలు ఉన్నాయి. అలా అని ఈ తేదీకి ఫ్లాపులు లేవా అంటే ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ. మరి ఇంత హిస్టారిక్ రిలీజ్ తో వస్తున్న ఎస్ఎస్ఎంబి 28 కూడా వీటి సరసన నిలవాలనేది ఫ్యాన్స్ ఆకాంక్ష.
This post was last modified on August 18, 2022 9:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…