మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతోంది. జూన్ రెండో వారం నుంచి వరుస డిజాస్టర్లతో కుదేలైన బాక్సాఫీస్ ఆగస్టు తొలి వారం నుంచి మళ్లీ బలంగా పుంజుకుంది. తొలి వారంలో రిలీజైన బింబిసార, సీతారామం అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్‌కు మళ్లీ కళ తీసుకొస్తే.. తర్వాతి వారంలో కార్తికేయ అదరగొడుతోంది. డీసెంట్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది.
నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాదు.. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచింది కార్తికేయ-2. వీక్ డేస్‌లో సైతం మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఈ చిత్రానికి థియేటర్ల సమస్య కొంత ప్రతికూలంగా మారింది. ముందు వారం సినిమాలు బింబిసార, సీతారామం రెండో వారంలో కూడా బాగా ఆడుతుండటంతో వాటికి పెద్ద ఎత్తునే థియేటర్లు కేటాయించారు. మరోవైపు నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం కూడా పెద్ద సంఖ్యలోనే థియేటర్లు చేజిక్కించుకుంది.
ఇక హిందీలో అయితే ఈ సినిమాను నామమాత్రంగా రిలీజ్ చేశారు. కానీ రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెరుగుతూ పోయాయి. అయినా సరే.. సినిమాకున్న డిమాండ్ మేర థియేటర్లు దక్కట్లేదు. ఐతే ఇటు తెలుగు చిత్రాలతో పాటు అటు హిందీ సినిమాలకు ముందే జరిగిన అగ్రిమెంట్ల మేర వారం రోజులకు థియేటర్లు కేటాయించేశారు. అద్దెల మీద థియేటర్లను ఇచ్చారు కాబట్టి ఎగ్జిబిటర్లు వసూళ్ల గురించి పట్టించుకోరు.
తమ సినిమాలకు థియేటర్లు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆశలు చంపుకోకుండా వారం రోజులు ఎదురు చూస్తారు. అందుకే శుక్రవారం వరకు కార్తికేయ-2కు నిరీక్షణ తప్పదు. ఈ వారం ఇటు తెలుగులో, అటు హిందీలో అంత ఆసక్తికర చిత్రాలేమీ బరిలో లేవు. బింబిసార, సీతారామం అప్పటికి పాతబడతాయి. కాబట్టి శుక్రవారం నుంచి కార్తికేయ-2కు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. ఈ వారానికి ఇండియా వైడ్ ఆ చిత్రం బాక్సాఫీస్ లీడర్‌గా నిలవడం, వసూళ్ల మోత మోగించడం ఖాయం అనే చెప్పొచ్చు.
This post was last modified on %s = human-readable time difference 11:50 am
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…
తమిళనాట దశాబ్దాల పాటు సూపర్ స్టార్ రజినీకాంతే నంబర్ వన్ హీరోగా ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్, కలెక్షన్లు…
కొన్నిసార్లు స్టార్ హీరోల ప్రెస్ మీట్లలో ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి ఎమోషనల్ గా స్పందిస్తే సోషల్ మీడియాలో విపరీత…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే… అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ ఊస్టవడం!.…
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…