ఆగస్ట్ నెల మొదటి సగాన్ని మూడు బ్లాక్ బస్టర్లతో పూర్తి చేసుకున్న టాలీవుడ్ బాక్సాఫీస్ మంచి హుషారు మీదుంది. బింబిసార, సీతారామం, కార్తికేయ 2లు ఇచ్చిన కిక్ మాములుగా లేదు. కేవలం వారంలోపే బ్రేక్ ఈవెన్ దాటేసిన అరుదైన ఘనతను కూడా ఇవి దక్కించుకున్నాయి. వీటిని చూడటం పూర్తి చేసిన మూవీ లవర్స్ కళ్ళు ఇప్పుడు గురు శుక్రవారాల మీద పడ్డాయి. చెప్పుకోవడానికైతే ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది సినిమాలు బరిలో దిగుతున్నాయి. మరి ఇన్నేసి వస్తున్నాయి కదా టికెట్ కౌంటర్లు కిక్కిరిసిపోయేంత సీన్ అయితే కనిపించడం లేదు.
వీటిలో మొదటిది 18నే వస్తున్న ధనుష్ తిరు. హఠాత్తుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న డబ్బింగ్ మూవీ ఇది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించడంతో అంతో ఇంతో దీని మీద ఆసక్తి లేకపోలేదు. ట్రైలర్ అంత ఎగ్జైట్ మెంట్ అయితే ఇవ్వలేకపోయింది. కంటెంట్ తో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. వరస దండయాత్రలతో విజయం కోసం పోరాడుతూనే ఉన్న ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ 19న వస్తుంది. ఇదే రోజు వాంటెడ్ పండుగాడ్, కమిట్ మెంట్, మాటరాని మౌనమిది, అంఅః, లవ్ 2 లవ్, నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా బరిలో దిగుతున్నాయి.
చూసేందుకు కౌంట్ అయితే పెద్దగానే ఉంది కానీ ఓపెనింగ్స్ విషయంలో దేని మీదా ఆశలు పెట్టుకోవడానికి లేదు. మౌత్ టాక్ బ్రహ్మాండంగా ఉంటే తప్ప రన్ ఆశించడం కష్టమే. అసలే వారం గ్యాప్ లో విజయ్ దేవరకొండ లైగర్ ఉంది. ఆలోగానే ఎంత రాబట్టుకుంటే అంత మంచిది. అయినా ఇంతగా ఒకేసారి పోటీ పడేందుకు కారణం లేకపోలేదు. థియేట్రికల్ రిలీజ్ అయితేనే కొంటామని ఈ మధ్య ఓటిటిలు నిబంధనలు స్ట్రిక్ట్ చేశాయి. అందుకే ఈ కాంపిటీషన్ ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.
This post was last modified on August 17, 2022 9:05 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…