Movie News

వీక్ డేలో సూప‌ర్ స్ట్రాంగ్‌

సినిమాకు క‌ష్ట కాలం న‌డుస్తోంది.. థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌ట్లేదు అంటూ రెండు వారాల ముందు వ‌ర‌కు టాలీవుడ్ జ‌నాలంతా తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. రోజు రోజుకూ థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ త‌గ్గిపోతుండ‌డం, కొత్త చిత్రాలు రిలీజైన తొలి వీకెండ్లో కూడా థియేట‌ర్లు నిండ‌క‌పోవ‌డంతో సినిమాల‌ మ‌నుగ‌డ ఎలా అనే ప్ర‌శ్న త‌లెత్తింది. కానీ కంటెంట్ ఉండి, టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉంటే జ‌నాలు పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలుచూస్తార‌న్న భ‌రోసాని గ‌త రెండు వారాల్లో రిలీజైన సినిమాలు రుజువు చేశాయి.

ఆగ‌స్టు తొలి వారం బింబిసార‌, సీతారామం అద్భుత స్పంద‌న తెచ్చుకోగా.. రెండో వారం కార్తికేయ‌-2 సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. సోమ‌వారం ఇండిపెండెన్స్ డే సెల‌వును పూర్తిగా ఉప‌యోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఉత్త‌రాదిన కూడా అంచ‌నాల‌కు మించి వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత కూడా జోరు త‌గ్గించ‌ట్లేదు.

మంగ‌ళ‌వారం సెల‌వు రోజు కాదు. పైగా వీక్ డే. మామూలుగా అయితే ఈ రోజు బాక్సాఫీస్ డ‌ల్లుగా ఉంటుంది. కానీ కార్తికేయ‌-2 మాత్రం వీక్ డేలో చాలా స్ట్రాంగ్‌గా నిల‌బ‌డింది. మార్నింగ్ షో, మ్యాట్నీల‌కు ఓ మోస్తరు స్థాయిలో వ‌సూళ్లు రాగా.. ఈవెనింగ్, నైట్ షోల‌కు చాలా వ‌ర‌కు హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే చాలా వ‌ర‌కు షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో న‌డిచాయి.

వాకిన్స్ కూడా క‌లుపుకుంటే మెజారిటీ థియేట‌ర్లు హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అయిన‌ట్లే. మంగ‌ళ‌వారం కూడా సినిమాకు మంచి షేర్ గ్యారెంటీ అన్న‌ది స్ప‌ష్టం. హిందీలో ఈ చిత్రానికి రోజు రోజుకు థియేట‌ర్లు, వ‌సూళ్లు పెరుగుతున్నాయి. అక్క‌డ కూడా సినిమా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతోంది. ఈ వారాంతంలో చెప్పుకోద‌గ్గ కొత్త సినిమాలేవీ లేక‌పోవ‌డంతో ఇటు తెలుగులో, అటు హిందీలో కార్తికేయ‌-2 దుమ్ముదులిపేలా క‌నిపిస్తోంది. అంతిమంగా సినిమా పెద్ద రేంజికే వెళ్లేలా ఉంది.

This post was last modified on August 17, 2022 12:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

1 hour ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

7 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

8 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

9 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

10 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

10 hours ago