Movie News

తారక్ ఏదో ఒకటి తేల్చాలి

ఆర్ఆర్ఆర్ వచ్చి అయిదు నెలలు కావొస్తోంది. థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటిటిలో రికార్డులు నెలకొల్పి శాటిలైట్ ప్రీమియర్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. అయినా జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. దర్శకుడు కొరటాల శివతో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అర్థం కాక అభిమానులు ఎదురు చూపుల్లోనే కాలం గడుపుతున్నారు. ఈ ఏడాదిలో మిగిలున్నది ఇంకో నాలుగు నెలలు మాత్రమే. ఒకవేళ సెప్టెంబర్ లో స్టార్ట్ చేసినా 2023 వేసవిలోగా పూర్తి చేయడం కష్టమే

మరోవైపు ప్రశాంత్ నీల్ తమ కాంబో వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో సెట్స్ పైకి వెళ్తుందని చెప్పడం ఆసక్తి రేపుతోంది. అంటే అప్పటికల్లా కొరటాల మూవీ ఫినిషవుతుందా లేదా అవ్వకపోయినా దీన్ని షురూ చేస్తారా అనేది సస్పెన్స్. మరోవైపు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు ఎవరి కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడో అంతు చిక్కడం లేదు. పెద్ది టైటిల్ తో గతంలో తారక్ కోసం ఏదో సబ్జెక్టు రెడీ చేశాడనే టాక్ వచ్చింది కానీ ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి యంగ్ టైగర్ ఫ్యాన్స్ నిరీక్షణ ఇంకొంత కాలం పొడిగించినట్టే.

ప్లానింగ్ లో లోపమో లేక ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నమో తెలియదు కానీ మొత్తానికి ఇంతేసి గ్యాప్ తీసుకోవడం మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టేదే. కొత్తగా ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశం ఉన్న లిస్టులో జూనియర్ పేరు వినిపించడంతో నిర్ణయం తీసుకోవడంలో ఇంకా ఆలస్యం చేస్తాడేమోనన్న అనుమానం లేకపోలేదు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ కనిపించి మూడేళ్లు దాటిపోయింది. అసలు కొరటాల శివ బయటికొచ్చి ఇదుగో ఫలానా డేట్ ని మొదలెట్టేస్తాం అని చెప్పేదాకా ఇది ఆగేలా లేదు

This post was last modified on August 17, 2022 12:02 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 minutes ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

32 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

40 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago