ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఎలాంటి అంచనా లేకుండా వచ్చి సైలెంట్ బ్లాక్ బస్టర్ అయిన బిచ్చగాడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు డబ్బింగ్ హక్కులను కేవలం యాభై లక్షలకు కొనుగోలు చేస్తే ఇరవై కోట్లకు పైగా వసూలు చేయడం గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. ఒక్కరోజులో హీరో విజయ్ ఆంటోనీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.
ఎంతగా అంటే ఎవరూ పట్టించుకోని అతని గత చిత్రం నకిలీని యుట్యూబ్ జనాలు ఎగబడి మరీ చూశారు. దెబ్బకు తర్వాత వచ్చిన సినిమాలను బయ్యర్లు ఎగబడి కొన్నారు. కానీ ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబడలేదు. భేతాళుడుతో మొదలుపెట్టి నిన్నా మొన్నటి దాకా ఎన్ని డిజాస్టర్లు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. తెలుగులోనే కాదు తమిళంలోనూ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది.
షూటింగ్ పూర్తి చేసుకున్నవి మూడు, నిర్మాణంలో ఉన్నవి నాలుగు మొత్తం ఏడు సినిమాలు లైన్ లో ఉన్నాయి కానీ ఏది ముందు వస్తుందో ఏది లేట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హత్యతో వస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు. రితిక సింగ్, మురళి శర్మలాంటి మనకు తెలుసున్న ఆర్టిస్టులు ఉన్నారు. ఒక హీరోయిన్ మర్డర్ చుట్టూ తిరిగే ఈ మిస్టరీ డ్రామా హాలీవుడ్ మూవీ ది ఎక్స్ పోజ్ ఆధారంగా రూపొందింది.
స్ట్రెయిట్ సబ్జెక్టులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో విజయ్ ఆంటోనీ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. జుట్టు నెరిసిపోయి వయసైపోయిన ఇన్వెస్టిగేటివ్ కం డిటెక్టివ్ ఆఫీసర్ గా కొత్త వేషమేదో ట్రై చేశారు. రాధికా శరత్ కుమార్ కు ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇచ్చారు. మరి హఠాత్తుగా బిచ్చగాడుతో వచ్చి ఆ తర్వాత మాయమైపోయిన ఓవర్ నైట్ వైభవం విజయ్ అంటొనీకి ఈ హత్యతో అయినా తిరిగి వస్తుందేమో చూడాలి.
This post was last modified on August 16, 2022 9:51 am
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పదవి చేపట్టాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇప్పటికైతే హరిహర వీరమల్లునే. ఇందులో అనుమానం…
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…