మాములుగా తెలుగు సినిమాల విడుదల తేదీలు మహా అయితే ఓ రెండు మూడు నెలల ముందు ప్రకటించడం ఆనవాయితీ. ఏకంగా ఏడాది అడ్వాన్స్ గా రిలీజ్ డేట్ చెప్పడం మాత్రం అరుదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లాంటి గ్రాండియర్స్ కి మాత్రమే అలా చేశారు కానీ అవి కూడా ఒకే మాట మీద ఉండలేక పరిస్థితుల ప్రభావం వల్ల డేట్లు మార్చుకుంటూ పోయాయి.
సలార్ అనౌన్స్ మెంట్ అభిమానుల్లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆది పురుష్ కోసం ఎదురు చూస్తుంటే ఊహించినని విధంగా ప్రశాంత్ నీల్ ప్రకటన రావడం షాకే. ప్రత్యేకంగా సెప్టెంబర్ 28నే ఎందుకు ఎంచుకున్నారన్న డౌట్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే దీని వెనుక పెద్ద కసరత్తే జరిగింది. అదేంటో చూద్దాం. ఆ రోజు ముస్లింల పవిత్ర పండగ మిలాద్ ఉన్ నబి. నేషనల్ హాలిడే కాబట్టి ఓపెనింగ్ గ్రాండ్ గా ఉంటుంది.
అందులోనూ గురువారం కావడం మొదటి అడ్వాంటేజ్. 29 రెగ్యులర్ శుక్రవారంతో పాటు 30 శనివారం, అక్టోబర్ 1 సండే వీకెండ్ ఎలాగూ భారీ కలెక్షన్లను ఇస్తుంది. తిరిగి అక్టోబర్ 2 సోమవారం గాంధీ జయంతి జాతీయ సెలవు. సో వసూళ్ల పరంగా అయిదు రోజుల పాటు ఇండియా వైడ్ రచ్చ ఖాయం. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆపై ఎలాగూ కంటిన్యూ అవుతుంది
ఈ క్యాలికులేషన్లు అన్నీ చెక్ చేసుకునే సలార్ ని ఈ విధంగా సెప్టెంబర్ 28కి లాక్ చేసినట్టుగా కనిపిస్తోంది. గతంలో రెబెల్ కూడా ఇదే డేట్ కి వచ్చిందనే నెగటివ్ సెంటిమెంట్ ఫ్యాన్స్ లో ఉండొచ్చు కానీ కంటెంట్ బలంగా ఉంటే ఇవేవి పని చేయవుగా. ఇప్పటివరకు యాభై శాతం దాకా పూర్తయిన సలార్ ఒకటే భాగమనే క్లారిటీ కూడా వచ్చేసింది. సీక్వెల్ ఉండొచ్చనే ప్రచారానికి చెక్ పడినట్టే. చూసేందుకు చాలా దూరంగా ఉన్నప్పటికీ ఆ తేదీ దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దనే మాస్ వార్నింగ్ కూడా ఇతర సినిమాలకు ఇచ్చినట్టు అయ్యిందిగా
This post was last modified on August 16, 2022 8:06 am
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…