Movie News

ఆ సినిమాకు పొగిడాడని.. ఈ సినిమా బాయ్‌కాట్

బాయ్‌కాట్.. బాయ్‌కాట్.. ఈ మధ్య బాలీవుడ్లో ఏ పెద్ద సినిమా రిలీజవుతున్నా ఈ మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు అదే పనిగా బాలీవుడ్ సూపర్ స్టార్ల సినిమాలను టార్గెట్ చేస్తున్నాయి. ఈ హీరోలు హిందుత్వానికి వ్యతిరేకులని ఆరోపిస్తూ ఒక వర్గం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి అక్కడి బడా హీరోలే కారణమంటూ ఇంకో వర్గం.. వీళ్లంతా ఒక్కటై హిందీ చిత్రాలను టార్గెట్ చేస్తున్నారు.

అదే పనిగా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి సినిమాలను కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వీరి దెబ్బకు కుదేలైన సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయిన మాట వాస్తవం. కానీ విడుదలకు ముందే దీని మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేసి సినిమాకు ఓపెనింగ్స్ లేకుండా చేసింది ఈ బ్యాచ్. ఇలా ఈ ‘బాయ్‌కాట్’ బ్యాచ్ బారిన పడి దెబ్బ తిన్న వేరే సినిమాలు కూడా ఉన్నాయి. షంషేరా కూడా ఆ కోవలోనిదే. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు ఈ జాబితాలో చేరే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఐతే ఇలాంటి నెగెటివిటీ ఏమీ ఉండదనుకున్న ఓ సినిమా కూడా ఇప్పుడు ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌కు టార్గెట్‌గా మారింది. ఆ చిత్రమే.. విక్రమ్ వేద. ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. తమిళంలో ఇదే పేరుతో బ్లాక్‌బస్టర్ అయిన సినిమాకు రీమేక్ ఇది. ఈ బాయ్‌కాట్ బ్యాచ్ ముఖ్యంగా ఖాన్ హీరోలను టార్గెట్ చేస్తుండగా.. ‘విక్రమ్ వేద’లో సైఫ్ ఒక లీడ్ రోల్ చేయడం వారిలో సినిమా పట్ల కొంత వ్యతిరేకత ఇప్పటికే ఉంది.

ఐతే హృతిక్ రోషన్ కూడా ఇందులో ఇంకో హీరో కావడంతో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు హృతికే వారి టార్గెట్‌‌గా మారిపోయాడు. అందుకు అతనిచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’ రివ్యూనే కారణం. ఓవైపు ఈ సినిమా పట్ల బాయ్‌కాట్ బ్యాచ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేక ప్రచారం చేస్తుంటే.. హృతిక్ ఆ సినిమా చూసి అద్భుతం అంటూ కొనియాడాడు. ఇది వాళ్లకు నచ్చలేదు. దీంతో ‘బాయ్‌కాట్ విక్రమ్ వేద’ అంటూ కొత్త హ్యాష్ ట్యాగ్ అందుకున్నారు. సినిమా రిలీజ్ టైంకి మరోసారి టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ నెగెటివిటీని తట్టుకుని ‘విక్రమ్ వేద’ ఏమేర నిలబడుతుందో చూడాలి.

This post was last modified on August 15, 2022 2:38 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

52 minutes ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

2 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

13 hours ago