‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఎం.ఎస్.రాజశేఖర్ శేఖర్ రెడ్డి.. ఈ పేరు అంత పాపులర్ కాదు కానీ.. ఎడిటర్ శేఖర్ అంటే మాత్రం ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు. మనిషి ఎవరని తెలియకపోయినా ప్రేక్షకులు కూడా చాలా సినిమాల్లో ఎడిటర్‌గా శేఖర్ పేరు చూసే ఉంటారు. ఎక్కువగా అతను పని చేసింది పూరి జగన్నాథ్ సినిమాలకు. ఆ అనుభవంతోనే ఒక కథ రాసి నితిన్‌ను మెప్పించి సినిమా తీశాడు.
అదే.. మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా విడుదలకు ముందు రాజశేఖర్ ఎంత అన్‌పాపులర్ అయ్యాడో, ఎంత నెగెటివిటీ ఎదుర్కొన్నాడో తెలిసిందే. వైఎస్సార్ ఫ్యామిలీ అభిమాని అయిన రాజశేఖర్ రెడ్డి కమ్మ, కాపు కులాలను.. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలను కించపరిచేలా ట్వీట్లు వేశాడన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. దాని తాలూకు ప్రతికూల ప్రభావం ఈ సినిమా మీద పడినట్లే కనిపిస్తోంది.
విడుదలకు ముందు సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండ్స్ నడిచాయి. ఇక సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్‌ను బాగా స్ప్రెడ్ చేసి.. దాని ఓపెనింగ్స్‌ను గట్టిగానే దెబ్బ తీశారు. ‘మాచర్ల నియోజకవర్గం’ డిజాస్టర్ అని దాదాపుగా తేలిపోయింది. తొలి రోజే ఆ సినిమా థియేటర్లు వెలవెలబోయే పరిస్థితి వచ్చింది. మామూలుగా తొలి చిత్రం తేడా కొడితే ఇంకో అవకాశం రావడం కష్టం. అందులోనూ ‘మాచర్ల..’లో శేఖర్ దర్శకత్వ ప్రతిభ అంటూ ఏమీ కనిపించలేదు.
ఇంత రొటీన్ సినిమాలు తీసే దర్శకులకు అవకాశాలు కష్టమే. దీనికి తోడు అతడి మీద ఉన్న సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీ ఉంది. అతడి మీద కొన్ని వర్గాలు పగబట్టేసినట్లే కనిపిస్తున్నాయి. తన ట్వీట్ల విషయంలో అతను వివరణ ఇచ్చినా వాళ్లు శాంతించలేదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతడి పట్ల వ్యతిరేకతను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు దర్శకుడిగా టాలెంటూ చూపించక, అటు నెగెటివిటీ ఎదుర్కొంటున్న శేఖర్‌కు ధైర్యం చేసి ఏ నిర్మాత అయినా ఇంకో ఛాన్స్ ఇస్తాడా అన్నది డౌటే. కాకపోతే ఎడిటర్‌గా అతడికి మంచి పేరే ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఉపాధికైతే ఢోకా లేదు.
This post was last modified on August 15, 2022 11:15 am
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…