Movie News

15 కోట్ల హీరోలు – విలువైన పాఠాలు

టాలీవుడ్ కు గోల్డెన్ టైం నడుస్తోంది. కేవలం పది రోజుల గ్యాప్ లో మూడు హిట్లు దక్కడం, థియేటర్లు కళకళలాడటం పరిశ్రమ వర్గాలను ఆనందపరుస్తోంది. ఒకపక్క ఇండస్ట్రీ సమస్యల గురించి నిర్మాతలు చర్చిస్తున్న టైంలోనే ఇలాంటి శుభపరిణామాలు చోటు చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశాలు కొనున్నాయి. బింబిసార చేసే టైంకి కళ్యాణ్ రామ్ మార్కెట్ డౌన్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మద్దతు ఉంటే తప్ప గట్టిగా ఓపెనింగ్స్ రాలేని పరిస్థితి నెలకొంది.

అందుకే ఎంత బడ్జెట్ పెట్టినా సరే బిజినెస్ మాత్రం దానికి తగ్గట్టు చేయకుండా రీజనబుల్ రేట్లకే ఇచ్చేశారు. ఫలితంగా బయ్యర్లకు మంచి ఫలితాలు దక్కాయి. సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ మహానటిలో చేసింది సపోర్టింగ్ రోల్, కనులు కనులు దోచాయంటే పేరు తెచ్చింది కానీ రాత్రికి రాత్రి నలభై యాభై కోట్ల రేంజ్ కేమీ చేరుకోలేదు. కానీ వైజయంతి సంస్థ కంటెంట్ ని నమ్మి పెట్టిన ఖర్చు, అమ్మింది ఎక్కువకే అయినా గ్రాండియర్ ను చూసి డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన పెట్టుబడి వెరసి ఏదీ వృధా కాలేదు. రెండో వారంలోనే ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసింది.

ఇక కార్తికేయ 2 హీరో నిఖిల్ తెరమీద కనపడే రెండేళ్లు దాటింది. అర్జున్ సురవరం తర్వాత రకరకాల కారణాల వల్ల అన్ని ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. దీని మీద నమ్మకంతోనే 18 పేజెస్, స్పైలను కొంత ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఆ భరోసానే గెలిచింది. ఈ ముగ్గురు హీరోల్లో ఎవరికీ వ్యక్తిగతంగా పదిహేను కోట్లకు మించి మార్కెట్ లేదు. అయినా సరే అద్భుత విజయాలు సొంతం చేసుకున్నారు.

తమ గురించి నేషనల్ మీడియాలోనూ మాట్లాడుకునేలా చేశారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. అన్నిసార్లు స్టార్ పవర్ పని చేయదు. కొనేవాడికి సరైన ధర ఇస్తే అందరికీ లాభాలు వస్తాయి. ముఖ్యంగా రోత ఫార్ములా, మూస మసాలాలు పక్కనపెట్టకపోతే జనం మొదటి రోజే థియేటర్ కు రారనే జ్ఞానోదయం ఆచార్య, థాంక్ యు లాంటివి నేర్పించాయి. సో మారుతున్న ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా సినిమాలు తీస్తే హీరో రేంజ్ ఏంటనేది పట్టించుకోరని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణలు కావాలా?.

This post was last modified on August 15, 2022 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

2 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

3 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

3 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

3 hours ago