నందమూరి కళ్యాణ్ రామ్ అంటే మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన అతనొక్కడే, పటాస్ యాక్షన్ ఎంటర్టైనర్లే అన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ రెండు చిత్రాలు యుఎస్‌లో అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ నందమూరి హీరో కెరీర్లో హైయెస్ట్ యుఎస్ గ్రాస్ 2 లక్షల డాలర్ల లోపే కావడం గమనార్హం. ‘పటాస్’ మూవీ 1.7 లక్షల డాలర్లతో కెరీర్ హైయెస్ట్ మార్కును అందుకుంది. కళ్యాణ్ రామ్ తర్వాతి హిట్ ‘118’ కూడా ఈ వసూళ్లను అధిగమించలేకపోయింది.
ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం ‘బింబిసార’.. యుఎస్‌లో ఏకంగా హాఫ్ మిలియన్ మార్కును టచ్ చేయడం విశేషం. ఈ శుక్రవారం 25 వేల డాలర్లు రాబట్టిన ఈ చిత్రం హాఫ్ మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టింది. ఈ చిత్రం ఈ రేంజికి వెళ్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ తెచ్చుకున్న ‘బింబిసార’కు యుఎస్‌లో అయితే అంత హైప్ కనిపించలేదు.
దీంతో పాటుగా రిలీజైన ‘సీతారామం’తో పోలిస్తే సగం లొకేషన్లు, స్క్రీన్లలో ‘బింబిసార’ను రిలీజ్ చేశారు. ప్రిమియర్స్ విషయంలో కూడా కొంత వెనుకంజ వేశారు. లేటుగా షోలు మొదలుపెట్టారు. ఇది మాస్ సినిమా కావడంతో యుఎస్ ఆడియన్స్‌లో ఆశించిన స్పందన ఉండకపోవచ్చని, పైగా టాక్ అటు ఇటు అయితే తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లపై ప్రభావం పడుతుందని సందేహించినట్లున్నారు. కానీ షోలు లేటైనా యుఎస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
ప్రిమియర్స్, తొలి రోజు కలిపి 1.5 లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి. తొలి వీకెండ్ అంతా ఇదే జోరు కొనసాగింది. సినిమా 3 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా వచ్చింది. వారాంతం అయ్యాక ఓ మోస్తరు వసూళ్లతో సాగిన ‘బింబిసార’ రెండో వీకెండ్లో బాగా పుంజుకుంది. హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది. యుఎస్‌లో కళ్యాణ్ రామ్ బిగ్గెస్ట్ హిట్ ‘పటాస్’ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టడం విశేషమే. ఈ చిత్ర ఓవరాల్ వసూల్లు రూ.25 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉన్నాయి.
This post was last modified on August 14, 2022 8:43 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…