కొవిడ్ తర్వాత హిందీ ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయింది. వాళ్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడంలో చాలా సెలక్టివ్‌గా ఉంటున్నారు. క్లాస్ టచ్ ఉన్న సినిమాల జోలికి అస్సలు వెళ్లట్లేదు. అలాగే ఇంతకుముందు బ్రహ్మరథం పట్టిన స్టార్ల సినిమాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు. ముఖ్యంగా లిబరల్స్‌గా ముద్ర వేయించుకుని హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను తమ సినిమాల్లో కించపరిచేలా చూపించడం, బయట ఆ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడం చేసి ఉంటే వాళ్లు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర బలైపోతున్నారు.
ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఇప్పుడు అలాగే దెబ్బ తింది. ‘పీకే’ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలున్నాయని, గతంలో ఆమిర్ దేశంలో అసహనం పెరిగిపోతుండటం గురించి కామెంట్లు చేశాడని తన చిత్రాన్ని టార్గెట్ చేశారు. ఆమిర్ అనే కాదు.. మొత్తంగా బాలీవుడ్ స్టార్లు తమ చిత్రాల్లో హిందుత్వాన్ని తక్కువ చేసి చూపించడంపై ఇప్పుడు ఒక ఉద్యమమే నడుస్తోంది సోషల్ మీడియాలో.
బాలీవుడ్ తీరు ఇలా ఉంటే సౌత్ సినిమాల్లో హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను, చరిత్రను గొప్పగా చూపించడాన్ని అక్కడి జనాలు కొనియాడుతున్నారు. ‘అఖండ’ సహా పలు చిత్రాలను ఉదాహరణగా చూపిస్తూ హిందీ జనాలే బాలీవుడ్ సినిమాలను తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. మన దగ్గర హిందు దేవుళ్లు, ఆచారాలను గ్లోరిఫై చేస్తే ఆ సినిమాలను కొనియాడుతున్నారు. హిందీలో ఈ టైపు చిత్రాలను రిలీజ్ చేస్తే బాగా ఆదరిస్తున్నారు కూడా. ‘కార్తికేయ-2’ ఈ తరహా చిత్రమే కావడంతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ సినిమాలు బరిలో ఉండడంతో ‘కార్తికేయ-2’ను హిందీలో పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేశారు. కానీ తక్కువ స్క్రీన్లు, షోలతోనే ఈ చిత్రానికి నార్త్‌లో మంచి స్పందన వస్తోంది. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. తొలి రోజు ఈ చిత్రానికి వచ్చిన స్పందన అక్కడి క్రిటిక్స్‌ను, ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో శ్రీకృష్ణుడి గురించి గొప్పగా చెప్పడం, చూపించడం, అనుపమ్ ఖేర్ కీలక పాత్ర చేయడం ప్లస్ అయింది. తొలి రోజు రెస్పాన్స్ చూశాక రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. బాలీవుడ్ ప్రేక్షకుల మూడ్‌కు తగ్గట్లుగా ‘కార్తికేయ-2’ టీం మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందనే చెప్పాలి.
This post was last modified on August 14, 2022 6:20 pm
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…