ఆమిర్ ఖాన్ సినిమా అంటే ఒకప్పుడు టాక్‌తో సంబంధం లేకుండా రూ.30 కోట్ల గ్రాస్ ఈజీగా వచ్చేసేది. అక్షయ్ కుమార్ సినిమాలంటే డే-1 రూ.20 కోట్ల గ్రాస్ గ్యారెంటీ అన్నట్లుండేది. కానీ గురువారం విడుదలైన ఈ ఇద్దరు హీరోల సినిమాలు ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షాబంధన్’ కలిపితే కూడా తొలి రోజు రూ.20 కోట్ల గ్రాస్ వస్తుందా అంటే సందేహంగానే ఉంది. ఈ రెండు చిత్రాలకూ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. తొలి రోజు వీటి టాక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.
‘లాల్ సింగ్ చడ్డా’కు డిజాస్టర్ టాక్ రాగా.. ‘రక్షా బంధన్’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రెండు చిత్రాలకూ తొలి రోజు ఎక్కడా హౌస్ ఫుల్స్ పడిన దాఖలాలు కనిపించలేదు. దారుణమైన విషయం ఏంటంటే.. ఆమిర్ సినిమాకు ఎన్నడూ లేని విధంగా చాలా థియేటర్లలో 10-20 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. జనాలు లేక తొలి రోజు షోలు క్యాన్సిల్ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. తెలుగులో చాలా గట్టిగా ప్రమోషన్లు చేసినా.. 10 శాతం కూడా నిండని థియేటర్లు బోలెడు.
సినిమా బాలేకుంటే ఫ్లాప్ కావడం వేరే విషయం. కానీ అసలు సినిమా ఎలా ఉందో చూడకుండానే ‘లాల్ సింగ్ చడ్డా’ను డిజాస్టర్‌గా జనం తీర్మానించేయడం, దాని పట్ల ఆసక్తి చూపించకపోవడం ఆందోళన రేకెత్తిస్తున్న విషయం. ఆమిర్ లాంటి తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి తలెత్తడం అనూహ్యం. కొవిడ్ తర్వాత బాలీవుడ్ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో చెప్పడానికి ఇది మరో రుజువు.
అక్షయ్ పరిస్థితి కూడా ఏమంత భిన్నంగా లేదు. ‘సూర్యవంశీ’తో అతను సత్తా చాటినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ‘బచ్చన్ పాండే’తో ఎదురు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు ‘రక్షా బందన్’ సైతం అతడికి రిలీఫ్ ఇచ్చేలా లేదు. ఇంతంత పెద్ద స్టార్లు నటించిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో కనీస ఆసక్తి లేకపోవడం, అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉండడం, ఓపెనింగ్స్ ఇంతగా పడిపోవడం బాలీవుడ్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఒక రకంగా ఈ శుక్రవారం బాలీవుడ్‌ను ఉలికి పాటుకు గురి చేసిందనడంలో సందేహం లేదు. బాక్సాఫీస్‌కు మళ్లీ కళ తెస్తాడనుకున్న ఆమిర్ ఖాన్ సైతం కొవిడ్ తర్వాత తలెత్తిన సంక్షోభంలో కొట్టుకుపోవడం బాలీవుడ్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేదే.
This post was last modified on August 12, 2022 11:26 am
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…