నితిన్ హీరోగా పరిచయమై ఇరవై ఏళ్లవుతోంది. కానీ దిల్ తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమాతో హిట్ కొట్టింది లేదు. మధ్యలో సీతారాముల కళ్యాణం లంకలో అనే సినిమాతో కంప్లీట్ మాస్ హీరో అవ్వాలని ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. హీరో , రెచ్చిపో ఇలా నితిన్ మాస్ సినిమా చేసిన ప్రతీ సారి ప్రేక్షకులు అతన్ని తిప్పికొట్టారు.
ఇప్పుడు నితిన్ ఆ ట్రాక్ లోకి వెళ్ళాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. మాచెర్ల నియోజిక వర్గం అనే టైటిల్ తో కంప్లీట్ గా మాస్ సినిమా చేశాడు. సినిమాలో సెకండాఫ్ అంతా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకున్నాడు. అంజలి ఐటెం సాంగ్, మాస్ ఫైట్స్ ఇలా అన్ని అల్లుకున్నాడు. ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ సినిమాను నిర్మించింది నితిన్ తండ్రి , అక్క. సొంత బేనర్ లో హిట్ దక్కుతుందా ? లేదా అనే టెన్షన్ ఓ వైపు ఈ సినిమాతో అయినా మాస్ హీరోగా ఎష్టాబిలాష్ అవ్వాలనే కసి మరో వైపు నితిన్ లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ఎడిటర్ ఎస్ ఆర్ శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ట్రైలర్స్, సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా కనిపిస్తున్నాయి. కానీ అలా వచ్చిన మాస్ ఆడియన్స్ ని ఈ కొత్త దర్శకుడు కం హీరో నితిన్ ఎలా మెప్పిస్తారో అన్నదే పాయింట్. మాస్ ఆడియన్స్ కి ఏ మాత్రం ఎక్కినా నితిన్ ఓ కమర్షియల్ మాస్ హిట్ దక్కడం ఖాయమనిపిస్తుంది.
This post was last modified on August 11, 2022 10:54 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…