ఒకప్పుడు నిర్మాతలకు హీరో తాలూకు అభిమానుల డిమాండ్లు తెలిసేవి కాదు కానీ సోషల్ మీడియా ట్రెండింగ్ పుణ్యమాని క్షణాల్లో వాళ్ళ మనసులో ఉన్నదేమిటో తెలిసిపోతోంది. కొన్నిసార్లు వీటికి తలొగ్గి సారీలు చెప్పిన సందర్భాలు వాళ్ళ కోరిక తీర్చిన ఉదంతాలు ఉన్నాయి. కానీ అందరూ ఒకేలా స్పందిస్తారని కాదు కానీ ఈ ట్వీట్ల వ్యవహారం ఒక్కోసారి వైరస్ గా మారి చాలా దూరం వెళ్లిన దాఖలాలు ఎన్నో.
తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజు మీద RC 15 అప్డేట్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆజాది అమృత్ మహోత్సవాల పేరిట డెబ్భై అయిదవ స్వాతంత్ర దినోత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. శంకర్ రామ్ చరణ్ కాంబోలో రూపొందుతున్న మూవీలో ఈ బ్యాక్ డ్రాప్ ఉంది.
ఇండిపెండెన్స్ కు ముందు జరిగే ఎపిసోడ్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే క్యారెక్టర్ లో చరణ్ షాక్ ఇస్తాడని గతంలోనే లీక్ వచ్చింది. దాని తాలూకు ఫోటోలు లీకై ఆన్ లైన్ లో రచ్చ చేశాయి. ఇలాంటివి చేస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్విసి సంస్థ అప్పట్లో ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. కట్ చేస్తే ఇప్పుడు టైటిల్ రిలీజ్ చేయడానికి ఇది సరైన సమయమని మెగాభిమానుల డిమాండ్.
టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఎలాగూ సెట్స్ లో షూట్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ఆల్రెడీ బయటికి వచ్చాయి కాబట్టి అదేదో అఫీషియల్ గా చేయమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగింది సబబుగానే ఉంది కానీ శంకర్ మనసులో ఏముందో బయటికి రావడం లేదు. కామన్ మ్యాన్ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ ఇంకా ఏదీ తేల్చలేదు. ఇండియన్ 2 కోసం బ్రేక్ ఇస్తారనే న్యూస్ కూడా ఇంకా ధృవీకరించలేదు
This post was last modified on August 11, 2022 10:39 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…