శుక్రవారం విడుదల సాంప్రదాయానికి భిన్నంగా ఒక రోజు ముందే రిలీజైన బాలీవుడ్ సినిమాల్లో ఒకటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కాగా రెండోది అక్షయ్ కుమార్ రక్షాబంధన్. అంచనాల విషయంలో రెండింటి మీద నార్త్ ఆడియన్స్ లోనూ వీటి మీద పెద్ద ఆసక్తి లేదని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి. అయితే మౌత్ టాక్ సహాయంతో కౌంటర్ సేల్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో జనాన్ని మెప్పించగలమనే నమ్మకంతో బరిలో దిగాయి. లాల్ సింగ్ భవితవ్యం ఆల్రెడీ తేలిపోయింది మరి రాఖీ బంధం ఎలా ఉందనే ఆసక్తి కలగడం సహజం.
ఇదో ఛాట్ దుకాణం నడిపే లాలా కేదార్నాథ్(అక్షయ్ కుమార్) కథ. పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్ళ బాధ్యత ఇతని మీదే ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో మైనస్ పాయింట్. కేదార్ చేసే పానీపూరిలు తింటే గర్భవతులకు తప్పకుండా మగసంతానం కలుగుతుందనే సెంటిమెంట్ అక్కడి జనాల్లో బలంగా వెళ్లడంతో ఇతనికి మహా గిరాకీ. కుటుంబం కోసం చిన్ననాటి స్నేహితురాలి(భూమి పెడ్నేకర్) ప్రేమను సైతం మూడు ముళ్ళదాకా తీసుకెళ్లకుండా ఆలస్యం చేస్తుంటాడు. మరి కట్నంతో ముడిపడిన చెల్లెళ్ళకు ఎలా వివాహం చేశాడనేదే అసలు స్టోరీ.
షారుఖ్ ఖాన్ కి జీరో రూపంలో మెగా డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తర్వాత అత్ రంగీరే అనే ఓటిటి మూవీతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇప్పుడీ రక్షాబంధన్ తో ఎమోషన్స్ ఆధారంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ సఫలీకృతం కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టరైజేషన్స్ తో టైం పాస్ చేయించి సెకండ్ హాఫ్ లో మెలోడ్రామాను విపరీతంగా జొప్పించేయడంతో ఈ రక్షాబంధన్ చూసేవాళ్లు చేతికి టైట్ అయిపోయి బాధ కలుగుతుంది. చెప్పాలంటే చిరంజీవి హిట్లర్ శుభలేఖ సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ రాఖీలోని కట్నం సందేశాలను కలిపితే అదే ఈ రక్షాబంధన్. ఏదో అద్భుతం చేసే అవకాశం లేనట్టే
This post was last modified on August 11, 2022 10:34 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…