గత వారాంతంలో విడుదలైన రెండు కొత్త చిత్రాల్లో టాక్ పరంగా సీతారామం ఎక్కువ మార్కులు వేయించుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా బింబిసార బాగా దూకుడు చూపించింది. తొలి రోజు కళ్యాణ్ రామ్ సినిమాకు ఆరున్నర కోట్ల షేర్ వస్తే.. సీతారామం షేర్ రూ.2.5 కోట్లకు పరిమితం అయింది. అందులోనూ ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది. ఇంత మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఈ వసూళ్లేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే అది క్లాస్ లవ్ స్టోరీ కావడం వల్ల తొలి రోజు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేకపోయింది.
కానీ సినిమాకు గొప్ప టాక్ రావడం, అందరూ క్లాసిక్ అని కొనియాడడంతో తొలి రోజు సాయంత్రం నుంచే వసూళ్లు పుంజుకున్నాయి. శని, ఆదివారాల్లో మంచి వసూళ్లు రాబట్టిందా సినిమా. ఆ రెండు రోజులకు దీటుగా సోమ, మంగళవారాల వసూళ్లు ఉన్నాయంటే సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో అర్థం చేసుకోవచ్చు. ఇది జెన్యూన్ హిట్ మూవీ అని చెప్పడానికి అది సంకేతం.
బింబిసారకు తొలి వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి బయ్యర్లు లాభాల బాటలోకి వచ్చేయగా.. సీతారామం విషయంలో కొంచెం ఆలస్యం అయింది. ఈ చిత్రం బుధవారం నాటికి బ్రేక్ ఈవెన్ అయింది. తొలి వారాంతంలో రూ.10 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించిన ఈ సినిమా తర్వాతి రెండు రోజుల్లో రూ.5 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.18 కోట్లకు అమ్మారు.
బుధవారం నైట్ షోలు అయ్యేసరికి సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్లే. గురువారం బయ్యర్లందరూ లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. సినిమాకు ఉన్న టాక్, వీకెండ్ తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ తీరు చూస్తే ఇది చాలా రోజులు థియేటర్లలో నిలిచేలా ఉంది. కాబట్టి బయ్యర్లందరికీ మంచి లాభాలు అందడం గ్యారెంటీ. థియేట్రికల్ రన్ అయ్యేసరికి సీతారామం బ్లాక్‌బస్టర్ స్టేటస్ కూడా అందుకునే ఛాన్సుంది. క్లాసిక్ అనిపించుకున్న మూవీ బ్లాక్‌బస్టర్ కూడా కావడం అరుదైన విషయమే.
This post was last modified on August 11, 2022 2:17 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…