ఎనిమిదేళ్ల కిందట చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమా కార్తికేయ. స్వామిరారా మూవీతో చాలా గ్యాప్ తర్వాత ఓ విజయం అందుకుని కెరీర్లో పుంజుకుంటున్న సమయంలో వచ్చిన కార్తికేయ పెద్ద హిట్టయి నిఖిల్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చింది. ఆ తర్వాత అతడికి మరికొన్ని విజయాలు దక్కాయి. అలాగే ఫ్లాపులూ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కొవిడ్, ఇతర కారణాల వల్ల కెరీర్ కొంచెం డల్లవగా.. కార్తికేయకు కొనసాగింపుగా తెరకెక్కిన సినిమా మీద అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఈ శనివారమే కార్తికేయ-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చిత్ర దర్శకుడు చందు మొండేటి.. కార్తికేయ-2 సూపర్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా విజయం సాధించి.. కార్తికేయ-3కి పునాది వేస్తుందని కూడా అతను వ్యాఖ్యానించాడు.
కార్తికేయ తెలుగు ప్రాంతమైన సుబ్రహ్మణ్యపురంలో జరిగిందని.. సీక్వెల్‌కు ఉత్తరాదిన ఉన్న ద్వారకను నేపథ్యంగా తీసుకున్నామని.. ఈ కథ ద్వారకతో పాటు పలు ప్రాంతాల్లో జరుగుతుందని.. ఈ చిత్రం తమ అంచనాలకు తగ్గట్లు విజయం సాధిస్తే.. దీనికి కొనసాగింపుగా కార్తికేయ-3 కచ్చితంగా తీస్తామని చందు చెప్పాడు. మూడో భాగం కోసం ఐడియాలు ఆలోచిస్తున్నానని.. ఆ కథ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని.. హీరో ఇంటర్నేషనల్ లెవెల్లో మిస్టరీ ఛేదించే ఆపరేషన్ మీద వెళ్తాడని చందు తెలిపాడు.
కార్తికేయ-1 చూడని వారికి కూడా కార్తికేయ-2 బాగా అర్థమవుతుందని.. మున్నాబాయ్ ఎంబీబీఎస్ తర్వాత మున్నాబాయ్ లగే రహోలో మాదిరి క్యారెక్టర్స్, సోల్ మాత్రమే తీసుకుని వేరే కథతో చేసిన సినిమా ఇదని చందు తెలిపాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చందు చెబుతూ.. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఖరారైందని, అదయ్యాక నాగార్జునతో సినిమా ఉంటుందని వెల్లడించాడు.
This post was last modified on August 11, 2022 11:36 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…