టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్ కి ఓ సెపరేట్ ఇమేజ్ ఉంది. హిట్టు.. ఫ్లాపు సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడం, కొత్త దర్శకులను పరిశ్రమకి అందించడంలో కళ్యాణ్ రామ్ కి ఎవరూ సాటి రారు. ఇదెవరైనా ఒప్పుకోవాల్సిందే. తాజాగా ‘బింబిసార’ తో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు నందమూరి హీరో. కొత్త దర్శకుడిని పెట్టి ఫాంటసీ సినిమా చేస్తున్నాడు ఏంటో అంత నమ్మకం అనుకున్న అందరి చేత ఇప్పుడు శెభాష్ అనిపించుకుంటూ వారి అభినందనలు అందుకున్నాడు.
ఏమాటకామాటే కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ విషయంలో నిజంగా పెద్ద రిస్కే చేశాడు. ఏ మాత్రం తేడా వచ్చినా కొన్ని కోట్లు నష్టపోవాల్సి వచ్చేది. ఇప్పుడు సినిమా భారీ వసూళ్ళు అందుకుంటూ నిర్మాత హరి , కళ్యాణ్ రామ్ ని సేఫ్ జోన్లో పెట్టింది. అయితే వసిష్ఠ ని నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేతిలో పెట్టినందుకే కళ్యాణ్ ని అందరూ ఎక్కువగా మెచ్చుకుంటున్నారు. వసిష్ఠ చాలా ఏళ్లుగా తండ్రి సపోర్ట్ లేకుండా దర్శకుడిగా విశ్వ ప్రయత్నాలు చేశాడు. పెద్ద చిన్నా తేడా లేకుండా కొందరు హీరోల దగ్గరికి కథలు పట్టుకొని తిరిగాడు. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ దగ్గరికి చేరుకున్నాడు.
ముందు చెప్పిన కథలు కళ్యాణ్ రామ్ కి ఎక్కలేదు కానీ ఎప్పుడైతే ‘బింబిసార’ ఐడియా చెప్పాడో అప్పటి నుండి వసిష్ఠ ను గుడ్డిగా నమ్మేశాడు. అతనిలో స్పార్క్ గమనించాడు. ఆ నమ్మకంతోనే స్క్రిప్ట్ రెడీ చేయమంటూ అప్పుడప్పుడు తనకి తోచిన సలహాలు అందిస్తూ భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టాడు. కళ్యాణ్ రామ్ పెట్టిన నమ్మకాన్ని భాద్యతగా తీసుకున్నాడో ఏమో కానీ బింబిసారతో టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చి తన హీరోని అలాగే ఇండస్ట్రీని సంతోష పెట్టాడు. సినిమాకు సంబంధించి కంటెంట్ పరంగా వసిష్ఠ ని మెచ్చుకోవాల్సిందే కానీ అంతకంటే ముందు అతన్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి , ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని ఇచ్చినందుకు మాత్రం కళ్యాణ్ రామ్ ని కచ్చితంగా అభినందించాలి.
This post was last modified on August 11, 2022 10:22 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…