Movie News

ఓటిటి పంచాయితీకి ఎన్ని చిక్కులో

ఇండస్ట్రీ సమస్యల పై ఈ నెల 1 నుంచి తీవ్ర చర్చల్లో ఉన్న ఇండస్ట్రీ పెద్దలు కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ఓటిటి గ్యాప్, ప్రొడక్షన్ ఖర్చుల గురించి ఒకే మాటపై తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని సమాచారం. ఒక్కో ఇష్యూ మీద ఒక్కో కమిటీ పెట్టి రిపోర్టులు ఇమ్మని చెప్పారు కానీ వాళ్ళు అందజేసే సూచనలను ప్రాక్టికల్ గా పాటించడానికి అందరూ సిద్ధంగా ఉండటం అనుమానమేనని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.

థియేటర్లకు జనం వచ్చే విషయంలో ఉన్న భ్రమలను బింబిసార, సీతారామంలు కలెక్షన్ల రూపంలో గాలిబుడగని పేల్చినంత ఈజీగా బద్దలు కొట్టాయి. బ్యాలన్స్ ఏమైనా ఉంటే పోకిరి తొక్కేసింది. సో ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు, ఓటిటిలకు అలవాటు పడ్డారనేది ఒప్పుకోలేని మాటగానే చెప్పుకోవాలి. ఎనిమిది నుంచి పది వారాల మధ్య థియేటర్ కు డిజిటల్ కు గ్యాప్ ఉంటేనే మంచిదన్న ప్రతిపాదన పట్ల మిశ్రమ స్పందన దక్కడంలో ఆశ్చర్యం లేదు కానీ దీన్ని స్ట్రిక్ట్ గా పాటించకపోతే ఏం చేయాలనే దాని మీద ఎలాంటి కంక్లూజన్ రావడం లేదట.

లాల్ సింగ్ చడ్డాకు ఆరు నెలల గ్యాప్ ఉంచుకోవడాన్ని కొందరు ప్రస్తావించినప్పటికీ అమీర్ ఖాన్ సినిమా చేసేదే నాలుగేళ్లకోసారి కాబట్టి అలాంటివి చెల్లుబాటవుతాయి కానీ ఏడాదికి రెండు మూడు చేసే మీడియం రేంజ్ హీరోలకు అలా చేస్తే వచ్చే నాలుగు డబ్బుల్లోనూ ఓటిటిలు కోత పెట్టేస్తాయని కొందరు అంటున్నారు. దాని బదులు మొదటివారానికి ఎలాగూ ఫలితం తేలిపోతుంది కాబట్టి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛని ప్రొడ్యూసర్ కు ఇవ్వాలనేది మరికొందరి వాదన. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఈ ఓటిటి పంచాయితీ మాత్రం అంత సులభంగా తెగదని, ఒకవేళ చేయాలనుకున్నా ఆచరణలో బోలెడు చిక్కులొస్తాయని ఇన్ సైడ్ టాక్

This post was last modified on August 11, 2022 8:33 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

3 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

3 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago