మతానికి సంబంధించిన సున్నితమైన అంశాలున్న కారణంగా ఈ నెల 5న అరబ్ దేశాల్లో విడుదల కావాల్సిన సీతారామంకి అక్కడి సెన్సార్ అధికారులు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. పలుదఫాల చర్చలు, పరిశీలనలు, కోతల తర్వాత ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రేపటి నుంచే షోలు ప్రారంభం కాబోతున్నాయి. అక్కడి అధికారులు కీలకమైన కొన్ని కట్స్, మ్యూట్స్ చెప్పినప్పటికీ అవి అసలు కథను ఇబ్బంది పెట్టేలా లేకపోవడంతో వైజయంతి టీమ్ హ్యాపీగానే ఉందట. సో ఫైనల్ గా రూటు క్లియర్ అయ్యింది.
నిజానికి బాలీవుడ్ సినిమాల్లోగా సీతారామంలో అభ్యంతరకరమైన విషయాలను చూపించలేదు. టెర్రరిజం మూలాలు పాకిస్థాన్ లో అక్కడి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నట్టు మాత్రమే స్పృశించారు. అది కూడా 1965 కాలానికి సంబంధించి. అలాంటప్పుడు తమకు సంబంధమే లేని విషయం గురించి అరబ్ అంతగా ఇదై పోవడం విచిత్రంగా ఉంది. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్, బెల్ బాటమ్, పద్మావత్, నీర్జా, ఢిల్లీ బెల్లి, ఫిజా, ఓ మై గాడ్, బొంబాయి లాంటి ఎన్నో చిత్రాలు దుబాయ్ లో బ్యాన్ కు గురయ్యాయి. కొన్ని వెలుగు చూశాయి మరికొన్ని ఆగిపోయాయి.
సీతారామం కూడా అదే లిస్టులో చేరుతుందేమోనన్న భయాలకు ఫైనల్ గా చెక్ పడింది. మొదటివారం పూర్తవ్వకుండానే ముప్పై కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతోంది. బింబిసార ధీటుగా పోటీ ఇస్తున్నా దాన్ని తట్టుకుని మరీ నిలబడుతోంది. ఈ వారం ఏకంగా మూడు కొత్త రిలీజులు ఉంటున్నాయి కాబట్టి వాటి టాక్ ని కాబట్టి నెక్స్ట్ వచ్చే వసూళ్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. దీని దెబ్బకే దర్శకుడు హను రాఘవపూడికి ఆఫర్లు వెల్లువెత్తున్నాయి
This post was last modified on August 11, 2022 12:46 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…