నాలుగేళ్ల క్రితం సుధీర్ బాబుని హీరోగా పెట్టి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ‘సమ్మోహనం’ అనే సినిమా చేశాడు. సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా ఫైనల్ గా రిజల్ట్ మేకర్స్ అనుకున్నట్టుగా రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంద్రగంటి సుధీర్ బాబు ను పెట్టి ‘వీ’ అనే థ్రిల్లర్ యాక్షన్ సినిమా చేశాడు. ఈసారి నానిని కూడా పెట్టుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ఫట్ అనిపించుకుంది. కాకపోతే ఓటీటీ డీల్ తో నిర్మాత దిల్ రాజు సేఫ్ అయ్యాడు.
ఇప్పుడు ఇంద్రగంటి – సుదీర్ బాబు కాంబోలో మరో సినిమా వస్తుంది. ఇటు కుర్ర హీరోకి అటు సీనియర్ దర్శకుడికి ఇద్దరికీ ఈ మధ్య సరైన హిట్ లేనందు వల్ల మళ్ళీ మళ్ళీ కలిసి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ ఇద్దరు. ఈసారి హీరోయిన్ గా కృతి శెట్టి ని తీసుకున్నారు. సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ అంటూ ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ మేకర్స్ వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ చూస్తే మాత్రం ఓ సందేహం కలుగకమానదు.
అటు ఇటు చేసి మళ్ళీ ఇంద్రగంటి ‘సమ్మోహనం’ కథనే తీస్తున్నాడా ? అనేది డౌటు. దీనికి కారణం పోస్టర్ లో సుదీర్ బాబు మెగా ఫోన్ పట్టుకొని కృతి శెట్టి పక్కన పరిగెడుతుండటం, ఆ వెనుక సినిమా టెక్నీషియన్స్ కనిపించడమే. సమ్మోహనంలో సినిమా హీరోయిన్ ని ఇష్టపడే ఓ అబ్బాయి కథ చూపించి దాన్ని అందంగా మలిచాడు ఇంద్రగంటి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి పోస్టర్ చూస్తే కూడా మళ్ళీ సినిమా బ్యాక్ డ్రాప్ , హీరోయిన్ ప్రేమకథ ఇలా కొంతవరకూ సింక్ అనిపిస్తుంది. ఈసారి సుదీర్ బాబుని డైరెక్టర్ గా మార్చి మళ్లీ హీరోయిన్ తో ప్రేమకథే చెప్తారా ? అనే సందేహం కలుగుతుంది.
పోస్టర్ చూసి అదే కథ అని చెప్పలేం కానీ… పోలిక మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఇంద్రగంటి ఈ కథలో ఆ అమ్మాయి గురించి కొత్తగా ఏం చెప్తారో ?
This post was last modified on August 11, 2022 12:35 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…