Movie News

ఆగస్ట్ 19 – చిన్న సినిమాలకో శుక్రవారం

ప్రతి శుక్రవారం ఒకటో రెండో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలవుతుండటంతో చిన్న చిత్రాలకు మహా చిక్కొచ్చి పడింది. వాటికి పోటీగా వెళ్తే కనీసం థియేటర్ రెంట్లు కట్టుకునేంత ఓపెనింగ్స్ కూడా రావు. పోనీ ఎక్కువ కాలం ఆగుదామా అంటే పెట్టుబడి మీద వడ్డీల భారం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫ్రైడేని పేరున్న హీరోలు బ్యానర్లు వదిలేయడంతో వాటికి ఫ్రీ గ్రౌండ్ దొరికింది. ఆగస్ట్ 19న చెప్పకోదగ్గ మూవీస్ ఏవీ బాక్సాఫీస్ బరిలో లేవు.

25న విజయ్ దేవరకొండ లైగర్ వస్తున్న నేపథ్యంలో ఎవరూ ఢీ కొట్టేందుకు ఇష్టపడటం లేదు. పంతొమ్మిదో తేదీ అన్నీ బడ్జెట్ వే వస్తున్నాయి. ఎన్ని డిజాస్టర్లు వస్తున్నా కనీసం అయిదారు సినిమాలు సెట్ల మీద ఉండేలా చూసుకుంటున్న ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ ని దించుతున్నారు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్. ట్రైలర్ కూడా వదిలారు కానీ ఇప్పటికైతే అంచనాలేం లేవు.

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన వాంటెడ్ పండుగాడ్ అనే కామెడీ ఎంటర్ టైనర్ వస్తోంది. దీనికీ బజ్ లేదు. మాటరాని మౌనమిది, నా వెంట పడుతున్న చిన్నవాడెవరమ్మాలు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ లిస్టుకి మరిన్ని తోడైనా ఆశ్చర్యం లేదు.

తొలిరెండు వారాల్లో  బింబిసార, సీతారామం, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, లాల్ సింగ్ చడ్డాలు సందడి చేయడంతో థియేటర్లకు సరిపడా ఫీడింగ్ దొరికేసింది. దీంతో ప్రత్యేకంగా మూడో వారాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం పడలేదు. గ్రాండియర్లు, యాక్షన్ థ్రిల్లర్లు, విజువల్ పోయెట్రీలు రాజ్యమేలుతున్న ట్రెండ్ లో ఓటిటిలు పెడుతున్న నిబంధనల మేరకే చిన్న సినిమాలు థియేటర్ రిలీజ్ కు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందన్న మాట వాస్తవమే కానీ వీటిలోనూ ఒకటో రెండో బాగా ఆడి డబ్బులు తేగలిగితే మిగిలిన వాళ్లకు కొనే బయ్యర్లకు కాసింత ధైర్యం వస్తుంది. 

This post was last modified on August 10, 2022 12:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…

15 minutes ago

ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…

1 hour ago

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…

2 hours ago

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

4 hours ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

5 hours ago