అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాల గురించి ఆయన చెబుతున్న మాటలకు.. వాస్తవంగా వాటిలో ఉన్న విషయానికి పొంతన ఉండడం లేదు. ఎఫ్-3, థాంక్యూ సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేసి దిల్ రాజు జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేశాయి. మరోవైపు ఈ రెండు చిత్రాల టికెట్ల ధరల విషయంలో కూడా రాజు చెప్పిన వ్యాఖ్యల విషయంలో విమర్శలు వచ్చాయి.
ఎఫ్-3కి ఎక్కువ రేట్లే పెట్టి తగ్గించినట్లు చెప్పడం ప్రేక్షకులకు రుచించలేదు. థాంక్యూ టికెట్ల ధరల విషయంలో ముందు ప్రెస్ మీట్లో ఇచ్చిన స్టేట్మెంట్‌పై మళ్లీ మాట మార్చేశారు. ఇక టాలీవుడ్లో సమస్యల పరిష్కారం కోసం షూటింగ్స్ ఆపేయాలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించిన దిల్ రాజు.. తన బేనర్లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘వారసుడు’ చిత్రీకరణను మాత్రం ఆపలేదు. ఇది తమిళ చిత్రం అంటూ కవర్ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. ఆయన క్రెడిబిలిటీని బాగా దెబ్బ తీసింది.
ఇప్పుడు దిల్ రాజు మరోసారి విమర్శలకు కేంద్రంగా మారాడు. ఆయన నిర్మాణంలో వచ్చిన ‘థాంక్యూ’ సినిమా.. థియేటర్లలో రిలీజైన 20 రోజులకే ఓటీటీలో వచ్చేస్తోంది. జులై 22న ఈ చిత్రం విడుదల కాగా.. ఆగస్టు 11న అమేజాన్ ప్రైమ్ దీన్ని స్ట్రీమ్ చేయబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఓటీటీ థియేటర్లను మింగేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నిర్మాతలు.. థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంలో రాజుది ముఖ్య పాత్ర.
తాజాగా ‘బింబిసార’ సక్సెస్ మీట్లో కూడా రాజు మాట్లాడుతూ.. థియేట్రికల్ రిలీజ్ నుంచి 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలందరం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సినిమాను కూడా అలాగే స్ట్రీమింగ్‌కు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా విషయంలో ఇలా మాట్లాడిన ఆయన.. తన ప్రొడక్షన్లో వచ్చిన ‘థాంక్యూ’ విషయంలో ఈ రూల్‌ను ఎలా బ్రేక్ చేశారో అర్థం కావడం లేదు. బహుశా ఈ చిత్రానికి డిజిటల్ డీల్ చాలా ముందే ఖరారైందని, కాబట్టి దీనికి కొత్త రూల్ వర్తించదని, భవిష్యత్తులో వచ్చే తన సినిమాలకు ఆ నిబంధనను అనుసరించి డీల్స్ చేసుకుంటామని రాజు చెబుతారేమో.
This post was last modified on August 10, 2022 12:40 am
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…