తెలుగులో ప్రేమకథలు ఎన్నో వచ్చాయి. ఘనవిజయాలు సాధించాయి. కానీ వాటిలో క్లాసిక్ స్టేటస్ అందుకున్నవి.. ప్రేమకావ్యాలు అనిపించుకున్నవి తక్కువే. తెలుగులో అత్యుత్తమ ప్రేమకథా చిత్రం ఏది అంటే చాలామంది చెప్పే పేరు.. గీతాంజలి. కానీ ఆ సినిమా తీసింది తమిళ దర్శకుడైన మణిరత్నం. ఆయన దాంతో పాటు తమిళంలో ఎన్నో ప్రేమకావ్యాలను అందించారు. ప్రేమకథలను అంత హృద్యంగా, అద్భుతంగా తీయగల నైపుణ్యం అందరికీ ఉండదు.
తెలుగులో మరో ప్రేమ కావ్యంగా చెప్పుకునే ‘మరో చరిత్ర’ తీసింది కూడా తమిళ దర్శకుడైన బాలచందరే. పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలి ప్రేమ’, ‘ఖుషి’ లాంటి లవ్ స్టోరీలు భారీ విజయాలందుకున్నాయి కానీ.. వాటిని తెరకెక్కించింది కూడా తెలుగు దర్శకులు కాదు. మరో క్లాసిక్ ‘ఏమాయ చేసావె’ను తెరకెక్కించింది గౌతమ్ మీనన్. గత దశాబ్ద కాలంలో చూస్తే.. నిన్ను కోరి, మజిలీ, తొలి ప్రేమ లాంటి మంచి ప్రేమకథలు వచ్చాయి. ఐతే అవి మంచి ప్రేమకథలనడంలో సందేహం లేదు. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మంచి విజయం సాధించాయి. కానీ వాటిని క్లాసిక్స్ అని ఒప్పుకోలేం.
కానీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’ మాత్రం తెలుగులో వచ్చిన ఆల్ టైమ్ గ్రేట్ లవ్ స్టోరీస్‌లో ఒకటనడంలో సందేహం లేదు. ఇలాంటి స్వచ్ఛమైన, గొప్ప ప్రేమకథలు తెలుగులో చాలా చాలా అరుదు. మరో చరిత్ర, గీతాంజలి, ఏమాయ చేసావె లాంటి అత్యుత్తమ ప్రేమకథా చిత్రాల జాబితాలో చేర్చదగ్గ సినిమా ఇది. దీన్ని మోడర్న్ క్లాసిక్‌గా అభివర్ణించవచ్చు. ఐతే పై జాబితాలోని సినిమాలకు, దీనికి తేడా ఏంటంటే.. ఇది మన తెలుగు దర్శకుడైన హను రాఘవపూడి రూపొందించడం. వేరే భాషల్లో కూడా ఈ సినిమా మీద ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగులో కంటే గొప్ప సమీక్షలు వచ్చాయి ఆ చిత్రానికి. వాళ్లు దీన్ని కల్ట్, క్లాసిక్ మూవీగా అభివర్ణిస్తున్నారు. తెలుగు దర్శకులు భారీ కమర్షియల్ సినిమాలు తీయడంలో దిట్టలని తెలుసు కానీ.. ఇక్కడ ఇలాంటి క్లాసిక్ లవ్ స్టోరీ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ సినిమా తెలుగు ప్రైడ్ అనడంలో సందేహం లేదు. ఈ ఘనత హనుకే దక్కుతుంది. హను మీద మణిరత్నం ప్రభావం చాలా ఉందన్నది వాస్తవం. అతడి తొలి చిత్రం ‘అందాల రాక్షసి’లో గీతాంజలి సహా చాలా మణిరత్నం సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఐతే అప్పుడు అతను మణిరత్నంను అనుకరించడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు ‘సీతారామం’ పక్కా ఒరిజినల్ అనిపిస్తోంది. ఈ రోజుల్లో మణిరత్నం కూడా తీయలేడు అనేంత గొప్పగా ఈ సినిమాను రూపొందించాడు. గతంలో మణిరత్నం డూప్లికేట్ అని హను మీద కౌంటర్లు వేసిన వాళ్లు.. ఇప్పుడు అతణ్ని ఎవరితోనూ పోల్చకుండా ‘హను’ను ఒక బ్రాండ్ లాగా చూపిస్తున్నారు. ఈ సినిమాతో అతను దక్కించుకున్న గౌరవం అలాంటిలాంటిది కాదు.
This post was last modified on August 9, 2022 10:20 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…