ఇటీవలే ఎఫ్3 ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న విక్టరీ వంకటేష్ ఇంకా కొత్త సినిమాని మొదలుపెట్టలేదు. జాతరత్నాలు ఫేమ్ అనుదీప్ తో ఉంటుందని లీక్ వచ్చింది కానీ అతనేమో శివ కార్తికేయన్ ప్రిన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎంతలేదన్నా ఇంకో రెండు నెలల దాకా అందుబాటులోకి రావడం కష్టమే. ఈలోగా ఖాళీగా ఉండటం ఎందుకనే ఆలోచనతో తనదగ్గరకు వచ్చిన ఓ క్యామియోని వెంకీ ఒప్పుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్.
అది కూడా ఎక్కువ కాల్ షీట్స్ డిమాండ్ చేసేది కాకపోవడంతో సానుకూలంగా స్పందించారట. వివరాల్లోకి వెళ్తే తమిళంలో సూపర్ సక్సెస్ అందుకున్న మూవీ ఓ మై కడవులే. దీన్ని విశ్వక్ సేన్ హీరోగా తెలుగులో ఓరి దేవుడా పేరుతో రీమేక్ చేశారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇందులో దేవుడిగా కనిపించే ప్రత్యేక అతిథి పాత్ర ఒకటుంది. ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి చేస్తే బ్రహ్మాండంగా పేలింది.
కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేయించారు కానీ అదింకా రిలీజ్ కాలేదు. ఇప్పుడా క్యారెక్టర్ కే తెలుగులో వెంకటేష్ ను ఒప్పించారట. డేట్లు మహా అయితే వారం లోపే చాలనే కండిషన్ తో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడీ ఫ్యాక్టర్ ఓరి దేవుడోకు చాలా ప్లస్ అవుతుంది.
ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ ని ట్రాక్ లో పెట్టుకుంటున్న విశ్వక్ సేన్ కు సీనియర్ల అండ చాలా అవసరం. అందులో భాగంగానే ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు వెంకీ తోడైతే ఓరి దేవుడాకు దగ్గుబాటి అభిమానుల అండ దొరుకుతుంది. మూవీ బాగుండి పాజిటివ్ టాక్ వచ్చేస్తే మంచి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టే కాబట్టి టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తమిళంలో తీసిన అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా వ్యవహరించారు.
This post was last modified on August 8, 2022 9:20 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…