రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఎప్పుడూ చేయని విధంగా అభిమానులు ట్రెండింగ్ సెలెబ్రేషన్స్ కు తెరతీశారు. పోకిరి రీ రిలీజ్ కోసం కొత్త సినిమా రేంజ్ లో హంగామా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 175కి పైగా స్పెషల్ ప్రీమియర్లను వరల్డ్ వైడ్ ప్రదర్శించబోతున్నారు. ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయమే ఉన్నప్పటికి గంట గంటకు షోలు పెరుగుతున్నాయి టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి.
ఇది అనితరసాధ్యమని బాలీవుడ్ మీడియా కూడా దీని గురించి కథనాలు వెలువరిస్తోంది. దీనికి మహేష్ 28కి కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్. అక్కడికే వద్దాం. సపోజ్ ఈ హడావిడి లేకపోతే ఈ సినిమా తాలూకు అప్డేట్ ఇమ్మని హారికా హాసిని మీద బాగా ఒత్తిడి ఉండేది. ముఖ్యంగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఫ్యాన్స్ నిలదీసేవాళ్ళు.
ఒకవేళ ఇచ్చే పరిస్థితి లేకపోతే ట్రెండ్ చేసి మరీ తిట్టేస్తారు. ఇది అందరు హీరోలకు జరిగే అనుభవమే. యువి క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్ టైన్మెంట్ ఈ రకంగా టార్గెట్ చేయబడి నిందలు భరించిన వాళ్లే. కానీ ఇప్పుడు మహేష్ బాబు కొత్త మూవీ గురించి అలాంటి టెన్షనేమీ లేదు.
రేపు శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేస్తారేమో కానీ అసలు షూటింగే మొదలుకాని నేపథ్యంలో టీజర్ లాంటివి ఆశించలేం. పోకిరి, ఒక్కడు స్పెషల్ షోల సంబరాల్లో మునిగితేలుతున్న ఫ్యాన్స్ దీన్ని మర్చిపోయారు. స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తి చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న మహేష్ తిరిగి వచ్చేశాడు కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. మొత్తానికి పండుగాడి గోలలో ఈ అప్డేట్ల బాధలు తప్పినట్టు అయ్యింది
This post was last modified on August 8, 2022 8:11 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…