ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకం నిజమై బింబిసార సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతూ థియేటర్ల దగ్గర సందడి చూపిస్తోంది. తన మార్కెట్ స్థాయికి మించి పెట్టిన బడ్జెట్, ఖర్చయినంత మొత్తానికి అమ్మకుండా సహేతుకమైన ధరలకే డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటి అంశాలు బయ్యర్లకు లాభాలు ఇచ్చే దిశగా తీసుకెళ్తున్నాయి. శని ఆదివారాలు ఇలాంటి టాక్ వచ్చిన సినిమాలకు సాధారణంగానే బాగుంటుంది.
అందులోనూ హౌస్ ఫుల్ బోర్డులకు అనుమానం అక్కర్లేదు. ఇదే జోరు సోమవారం కూడా కొనసాగిస్తే బ్లాక్ బస్టర్ స్టాంప్ పడిపోతుంది. కథనంలో తడబాటు, కొన్ని లాజిక్స్ లైట్ తీసుకోవడం లాంటివి పక్కనపెడితే ఫాంటసీ సినిమాల్లో ఇవి సీరియస్ గా తీసుకోవాల్సినవి కాదు కాబట్టి జనం ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే సెంటిమెంట్, యాక్షన్, థ్రిల్ అన్నీ పుష్కలంగా కుదిరిన బింబిసార ఒక్క పాటలు మాత్రమే ఆశించిన స్థాయిలో లేవనేది ఫ్యాన్స్ కంప్లయింట్. నేపధ్య సంగీతంతో ఎంఎం కీరవాణి అదరగొట్టినప్పటికీ పెద్ద ప్లస్ గా నిలవాల్సిన సాంగ్స్ మాములుగా ఉండటం కొంత లోటే అనిపించింది. ఈశ్వరుడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట తప్ప మిగిలినవి అంతంతమాత్రమే.
మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్లకు పాటలు ఎంత అడ్వాంటేజ్ అయ్యాయో చూశాం. ఇప్పటికీ యూట్యూబ్ లో వీటిని చూస్తున్నారు కాబట్టే మిలియన్ల వ్యూస్ ధారాళంగా వస్తుంటాయి. కానీ బింబిసారలో అలా కుదరలేదు. సెకాంఫ్ హాఫ్ లో వచ్చే కళ్యాణ్ రామ్ క్యాథరిన్ త్రెస్సా డ్యూయెట్ పిక్చరైజేషన్ బాగున్నప్పటికీ ట్యూన్ ఎంజాయ్ చేసేలా అనిపించదు. ఒకవేళ మ్యూజిక్ కూడా బెస్ట్ వచ్చి ఉంటే వీటి లెవెల్ ఇంకా పెరిగేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా బిజిఎంతో ర్యాంప్ ఆడేసిన కీరవాణికి ఫ్యాన్స్ ఈ ఒక్క అసంతృప్తి నుంచి మినహాయింపు ఇచ్చేశారు
This post was last modified on August 7, 2022 6:55 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…