తెలుగులో కొంచెం పోష్ లుక్ ఉన్న స్టైలిష్ విలన్ పాత్ర అనగానే అందరికీ జగపతిబాబే గుర్తుకు వస్తున్నాడు. ‘లెజెండ్’తో ప్రతినాయక పాత్రల్లోకి మారిన జగపతి.. అప్పట్నుంచి పోష్ విలన్ పాత్రలు చాలానే చేశాడు. ఈ పాత్రలు చేసి చేసి తనకు బోర్ కొట్టేస్తోందని కూడా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయినా సరే.. పెద్ద స్టార్లు చేసే భారీ చిత్రాల్లో ఆ తరహా పాత్రలు వస్తే ఆయన కాదనలేకపోతున్నారు.
ఫిలిం మేకర్స్ కూడా ఆ టైపు పాత్రలే రాసి.. జగపతి వైపే చూస్తున్నారు. తాజాగా జగపతికి అలాంటి పాత్ర మరొకటి తగిలింది. మెగాస్టార్ చిరంజీవి చేయబోయే ‘లూసిఫర్’ రీమేక్‌లో విలన్ పాత్రను జగపతిబాబే చేయబోతున్నట్లు సమాచారం. ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఇక్కడ ఆయన చేయనున్నారు.
ఓవైపు డ్రగ్ మాఫియాను నడుపుతూ.. మరోవైపు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కింగ్ మేకర్ పాత్ర ఇది. ఈ పాత్రకు తెలుగులో పర్ఫెక్ట్‌గా సూటయ్యే నటుడంటే జగపతిబాబే. ఐతే ఆయన ఇలాంటి పాత్రలు చాలా చేసిన నేపథ్యంలో ఇంకెవరైనా ఉన్నారేమో అని చూశాడట దర్శకుడు సుజీత్, నిర్మాత చరణ్. ఐతే కొన్ని పేర్లు అనుకున్నప్పటికీ ఎవరితోనూ సంతృప్తి చెందక చివరికి జగపతినే ఓకే చేశారట.
చిరంజీవి సినిమాలో విలన్ పాత్ర అంటే.. క్యారెక్టర్ ఎలాంటిదని జగపతి ఎందుకు చూస్తాడు? ఆయన కూడా సింపుల్‌గా ఓకే చెప్పేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోకు సోదరి తరహా పాత్ర ఒకటి ఉంటుంది. దానికి విజయశాంతి, సుహాసినిల పేర్లు వినిపించాయి ఇంతకుముందు. ఐతే చివరికి ఖుష్బును ఈ పాత్రకు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఆమె ‘స్టాలిన్’లో చిరుకు సోదరిగా నటించడం విశేషం.
This post was last modified on July 3, 2020 11:54 am
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…