ఈ నెల 9న రీ రిలీజ్ కాబోతున్న పోకిరి బుకింగ్స్ చూస్తే మతులు పోవడం ఖాయం. ఒక్క హైదరాబాద్ లోనే ఇప్పటికి పాతిక షోలు వేస్తే దాదాపుగా అన్నీ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ కావడం గమనార్హం. ఇవింకా పెరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు రాత్రి సుమారు వంద నుంచి నూటా యాభై మధ్య ప్రీమియర్లు ఫిక్స్ అయ్యాయి.
కొన్ని చోట్ల టికెట్ల కోసం ఒత్తిడి తట్టుకోలేక అదనపు థియేటర్లను జోడిస్తుంటే అప్పటికప్పుడు అవి కూడా హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయంటే షాక్ కాక మరేమిటి. ఇంత మేనియాని గత రెండు దశాబ్దాల్లో ఏ సినిమా సొంతం చేసుకోలేదన్నది వాస్తవం. యుట్యూబ్ లో ఫ్రీగా చూసే సౌకర్యం ఉండగా ఇప్పుడీ క్రేజ్ రావడం ఏమిటాని సమస్య ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
పోకిరి టైంలో చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు దాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని అందుకోలేదు. వాళ్లకు పండుగాడి యుఫోరియాని వినడం చదవడం తప్ప ప్రత్యక్షంగా చూడలేదు. దాన్ని వాళ్లకు మరోసారి హాళ్ల దగ్గర రుచి చూపించే ఉద్దేశంతో సీనియర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు.
బుక్ మై షోలో పెరుగుతూ పోతున్న షోలను చూస్తేనే చెప్పొచ్చు సూపర్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో. ఇదొక్కటే కాదు ఒక్కడు కూడా ఇదే తరహాలో ఒక రోజు ముందు ఆగస్ట్ 8కి షోలు వేస్తున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఏడు షోలు ఫుల్ కావడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. దానికి దర్శకుడు గుణశేఖర్ తో సహా పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించబోతున్నారు. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ గా మరి ఇతర ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరోల బ్లాక్ బస్టర్లను ఇలా ప్రత్యేకంగా వేసుకుని మురిసిపోవడం మాములు విషయమయ్యేలా ఉంది
This post was last modified on August 6, 2022 9:37 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…