‘కార్తికేయ’ సినిమాతో ఇటు ఇండస్ట్రీ జనాలను, అటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన దర్శకుడు చందు మొండేటి. అతడి నుంచి మున్ముందు ఎగ్జైటింగ్ సినిమాలు చూడొచ్చన్న ఆశ అందరిలోనూ కలిగింది. ఐతే రెండో సినిమాగా అనుకోకుండా రీమేక్ అయిన ‘ప్రేమమ్’ చేయాల్సి వచ్చింది. ఆ సినిమాతోనూ అతను విజయం అందుకున్నాడు. దీని తర్వాత నాగచైతన్య హీరోగా అతను తీసిన ‘సవ్యసాచి’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా ఘోరంగా విఫలమైంది. ఈ ఫెయిల్యూర్ మీద చందు ఎక్కడా పెద్దగా స్పందించింది లేదు. ఆ సినిమా తర్వాత అతను మీడియా దృష్టిలో కూడా పడలేదు. కెరీర్లో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత అతను ‘కార్తికేయ’ సీక్వెల్ మీద దృష్టిసారించాడు. ఈ సినిమా కరోనా సహా రకరకాల కారణాల వల్ల బాగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాకు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాడు చందు.
ఇందులో ‘సవ్యసాచి’ ఫెయిల్యూర్ గురించి అతను మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాను కన్ఫ్యూజ్ అయినట్లు చందు తెలిపాడు. ఒక కన్విక్షన్‌తో ఆ సినిమా చేయలేదని, ఏం చేస్తున్నాననే విషయంలో తనకు తాను కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల సినిమా తేడా కొట్టిందని అతను చెప్పాడు. ఈ సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ తెలిసిపోయిందని కూడా అతను వెల్లడించాడు.
సినిమా చూసుకుంటే తనకే నచ్చలేదని, ఒకవేళ ఇది సక్సెస్ అయినా దాని క్రెడిట్ మనం తీసుకోకూడదు అని తన అసిస్టెంట్లతో అన్నట్లు చందు వెల్లడించాడు. ఒక సినిమా విషయంలో ఏదైనా తప్పు చేయడం మొదలైతే అన్నీ తప్పుగానే అవుతాయని.. ‘సవ్యసాచి’ విషయంలో అదే జరిగిందని.. బేసిక్ ఐడియా, మాధవన్ పాత్ర.. ఇలా అన్నీ తేడా కొట్టాయని చందు తెలిపాడు. తన కెరీర్లో ఓవర్ బడ్జెట్ అయిన సినిమా కూడా అదే అని.. అందుకు తనతో సహా అందరూ కారణమే అని తెలిపాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి మంచి పెద్ద బేనర్ అండ ఉన్నా, తనకు కావాల్సిందల్లా సమకూర్చినా మంచి సినిమా చేయలేకపోయానని అతను చెప్పాడు.
This post was last modified on August 5, 2022 8:43 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…