Movie News

కళ్యాణ్ రామ్: నో నెగెటివిటీ స్టార్

ఈ రోజుల్లో ఒక కొత్త సినిమా రిలీజవుతోందంటే.. షో పడకముందే నెగెటివ్ ప్రాపగండా మొదలైపోతుంది. అదే పనిగా సినిమాను డీగ్రేడ్ చేసే పోస్టులు పెడుతూ నెగెటివిటీని స్ప్రెడ్ చేసే బ్యాచ్‌లు సిద్ధంగా ఉంటున్నాయి. ఈ విషయంలో దాదాపుగా అందరు హీరోలూ బాధితులే అవుతున్నారు. సోషల్ మీడియాలో శ్రుతి మించుతున్న ఫ్యాన్ వార్స్ పుణ్యమా అని.. ఒక హీరో రిలీజైనపుడు అవతలి వర్గం వాళ్లు దాని గురించి నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం.. దీనికి బదులుగా అవతలి వర్గం హీరో సినిమా విడుదలైనపుడు వారి వైరి వర్గం డ్యూటీ ఎక్కడం మామూలైపోయింది.

అసలే సినిమాల పరిస్థితి ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో ఈ నెగెటివిటీ మరింతగా దెబ్బ తీస్తోంది. ఐతే టాలీవుడ్లో కొందరు హీరోలు మాత్రమే ఈ నెగెటివిటీ నుంచి తప్పించుకుంటూ ఉంటారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. నందమూరి అభిమానులు ఫ్యాన్ వార్స్‌లో జోరుగా పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆ కుటుంబానికి చెందిన బాలయ్య, ఎన్టీఆర్‌ సినిమాలు రిలీజైనపుడు వైరి వర్గాలు నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తాయి కానీ.. కళ్యాణ్ రామ్‌కు మాత్రం ఆ బెడదలేదు.

కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా చాలా అణకువతో వ్యవహరిస్తాడు. మిడిసి పడడు. ఎవరి గురించీ నోరు జారడు. ఇక అన్నింటికీ మించి సినిమాల కోసం అతను పడే కష్టం, తపన తన పట్ల ఒక సానుకూల భావం కలిగేలా చేస్తాయి. వీటికి తోడు ఈ నందమూరి హీరో మీద అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కొంత సానుభూతి కూడా ఉంది. ఓం, హరే రామ్ లాంటి సినిమాలు ఎంతో ప్యాషన్‌తో చేసిన అతను.. వాటి మీద భారీ బడ్జెట్లు పెట్టి అవి బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు.

అయినా తన ప్రయత్నం మానలేదు. ఇప్పుడు ‘బింబిసార’ లాంటి సాహసోపేత సినిమా చేశాడు. కొత్తగా ఏదో ట్రై చేస్తుండడం, దీని మీదా భారీ బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమా బాగా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రోమోలు బాగుండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. బేసిగ్గా కళ్యాణ్ రామ్ మీద అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉండడం వల్లేనేమో ఈ సినిమా విషయంలో ఎవ్వరూ ఎలాంటి నెగెటివ్ కామెంట్లు చేయట్లేదు. సినిమా ఎలా ఉన్నా సరే మామూలుగా వేరే సినిమాలకు చేసినట్లు దీనికి నెగెటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు లేనట్లే. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా మంచి విజయం సాధించే అవకాశముంది.

This post was last modified on August 4, 2022 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

13 minutes ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

1 hour ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

2 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

2 hours ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

2 hours ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

3 hours ago