సినీ రంగంలో చిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. మామూలుగా సినిమాల సక్సెస్ రేట్ చాలా తక్కువ కాబట్టి సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతుంటారు సినీ జనాలు. ఐతే ఈ సెంటిమెంట్లలో కొన్ని పాజిటివ్ అయితే, కొన్ని నెగెటివ్. ఐతే యువ కథానాయకుడు నిఖిల్ ఒక నెగెటివ్ విషయాన్ని పాజిటివ్ సెంటిమెంటుగా మార్చుకున్నాడనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
అతడి సినిమాలు ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడితే హిట్టవుతాయన్నదే ఆ సెంటిమెంట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమే అయింది. ముఖ్యంగా అర్జున్ సురవరం చాలాసార్లు వాయిదా పడి, చివరికి రిలీజయ్యాక సక్సెస్ అయింది. ఇప్పుడు నిఖిల్ కొత్త చిత్రం కార్తికేయ-2 కూడా పలుమార్లు వాయిదా పడి ఆగస్టు 13కు ఫిక్స్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిఖిల్‌కు ఈ వాయిదా సెంటిమెంట్ గురించి ప్రశ్న ఎదురైంది.
దీనికి నిఖిల్ బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో ఏ నటుడికీ ఇలా జరిగి ఉండదు. నా సినిమాకు గండం వస్తే సక్సెస్ అవుతుంది…. సెలబ్రేట్ చేసుకుంటాను అని అనుకోలేదు. అయితే నాకు కూడా ఎక్కడో ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ కూడా డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ సినిమా.. అది మాకు పెద్ద హడల్. ‘అర్జున్ సురవరం’ కూడా చాలాసార్లు వాయిదా పడి చివరికి రిలీజై హిట్టయింది.
ఆ తర్వాత నేను సినిమా చేయకపోవడానికి ముఖ్య కారణం కరోనా. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ‘కార్తికేయ 2’ కోసం వెయిట్ చేసి ఈ సినిమా చేశాను. ఒక సినిమాకు ఇంకో సినిమాకు క్లాష్ ఉండకూడదనే మా సినిమాను వాయిదా వేయించారు. ఒక రకంగా క్లాష్ లేకపోవడం మంచిదే. కానీ ప్రతిసారీ మా సినిమానే వెనక్కి వెళ్లడం నాకు బాధగా అనిపించింది. చివరికి అందరం కలిసి ఆగస్టు 13న మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని చెప్పాడు.
This post was last modified on August 4, 2022 10:15 am
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…