ప్రస్తుతం ఇండియాలో భారీతనం ఉన్న, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు ఎవరు అత్యుత్తమ నేపథ్య సంగీతం అందిస్తారు అని అడిగితే.. మెజారిటీ చెప్పే పేరు.. కీరవాణి. ఆయన నిన్నటితరం సంగీత దర్శకుల్లా దర్శకుల్లా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అవగాహన ఉంది. అదే సమయంలో ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఆర్ఆర్ ద్వారా గూస్ బంప్స్ ఎలా ఇవ్వాలో, భావోద్వేగాల్ని ఎలా పతాక స్థాయికి తీసుకెళ్లాలో కూడా తెలుసు.
ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలా అరుదు అయిపోయారిప్పుడు. అందుకే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలకు ఆయన సంగీతం అంత ప్లస్ అయింది. ఈ వారాంతంలోనే విడుదల కానున్న ‘బింబిసార’కు కూడా ఆయనే నేపథ్య సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినపుడు అందులో కీరవాణి పేరు లేకపోవడం గమనార్హం.
సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ పేరే కనిపించింది. నిజానికి ‘బింబిసార’ సినిమా మొదలుపెడుతున్నపుడు ఈ తరహా చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు అయితేనే బాగుంటుందని అనుకున్నారట. ఐతే అప్పటికి ఆయన ‘ఆర్ఆర్ఆర్’ పనిలో తీరిక లేకుండా ఉండడంతో అడిగితే ఒప్పుకుంటారో లేదో అని భయపడి దర్శకుడు వశిష్ఠ్ ఆ ప్రయత్నం చేయలేదట.
తర్వాత ‘కంచె’, ‘గౌతమపుత్ర శాతకర్ణి’ లాంటి పీరియడ్ సినిమాలకు సంగీతం సమకూర్చిన చిరంతన్‌ను సంప్రదించామని.. కథ చప్పగానే ‘కర్మ’ పాట ట్యూన్ ఇచ్చేశారని, మిగతా పాటలకు మంచి ట్యూన్స్ అందించారని వశిష్ఠ్ తెలిపాడు. ఐతే సినిమాఅంతా అయ్యాక నేపథ్య సంగీతం పని మొదలుపెట్టాలనుకున్నపుడు.. కీరవాణి అయితేనే దీనికి న్యాయం చేయగలరని అనిపించిందని.. ఏదైతే అది అయిందని ఆయన్ని ఒకసారి సంప్రదిద్దామని ప్రయత్నించామని.. ఇది కళ్యాణ్ రామ్ సినిమా కావడం, దీని నేపథ్యం చూసి ఆర్ఆర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని.. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని వశిష్ఠ్ వెల్లడించాడు.
This post was last modified on August 3, 2022 10:04 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…