ఒకే వారం రెండు ఆసక్తికర చిత్రాలు రిలీజవడం.. అవి రెండూ సమాన స్థాయిలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడం.. థియేటర్ల వైపు ఆకర్షించడం అరుదుగా జరుగుతుంటుంది. జూన్ నెలలో మేజర్, విక్రమ్ సినిమాలు రిలీజై రెండూ ఘనవిజయం సాధించాయి కానీ.. విడుదలకు ముందు తెలుగులో ‘విక్రమ్’ మీద మరీ అంచనాలేమీ లేవు. కానీ మౌత్ టాక్ అదిరిపోవడంతో సినిమా పెద్ద సక్సెస్ అయింది.
ఐతే ఈ వారం రాబోతున్న ‘బింబిసార’, ‘సీతారామం’ రెండూ కూడా ప్రేక్షకుల్లో ఒకే స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రెండు సినిమాలకూ డీసెంట్ బజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వాటి వాటి స్థాయిలో బాగానే జరుగుతున్నాయి. ఐతే ఈ రెండు చిత్రాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది.
‘బింబిసార’ ప్రధానంగా మాస్ దృష్టిని ఆకర్షిస్తుండగా.. ‘సీతారామం’ క్లాస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. రెండూ భిన్నమైన సినిమాలు కావడం, వాటి ఆడియన్స్ కూడా వేర్వేరు కావడమే ఇలా ధైర్యంగా బాక్సాఫీస్ క్లాష్‌కు రెడీ అవ్వడానికి ఒక కారణం. ఆగస్టు 5కు ‘కార్తికేయ-2’ను షెడ్యూల్ చేసినపుడు ‘బింబిసార’ టీం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుక్కారణం.. జానర్ పరంగా క్లాష్ జరిగి, ప్రేక్షకులూ స్ప్లిట్ అవుతారన్న ఉద్దేశంతోనే ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
ఐతే ‘సీతారామం’కు మంచి బజ్ ఉన్నప్పటికీ.. దాన్ని పెద్ద క్లాష్ లాగా భావించకపోవడానికి కారణం.. జానర్ పరంగా వైవిధ్యం, దాని ఆడియన్స్ వేరు కావడమే. రెండు సినిమాలకు మంచి టాక్ వస్తే దేని ఆడియన్స్ దానికి ఉంటారు. రెండూ బాగా ఆడతాయి. రెంటికీ టాక్ బాలేకున్నా క్లాష్ అన్నది సమస్య కాదు. అలా కాకుండా ఒక సినిమాకు బాగుండి, ఇంకో సినిమాకు టాక్ బాలేకుంటే మాత్రం జానర్ గురించి పట్టించుకోకుండా ఒక సినిమా వైపు ప్రేక్షకులు పోలరైజ్ అయ్యే ఛాన్సుంది. కాబట్టి ఈ రెండు చిత్రాలకూ టాక్ అన్నది చాలా కీలకంగా మారింది.
This post was last modified on %s = human-readable time difference 9:51 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…