బాలీవుడ్ నుండి వచ్చే హీరోయిన్లు.. లేద కన్నడ తమిళంలో నుండి దిగుమతయ్యే భామలు.. వచ్చి రావడంతో ఒక సినిమాలో కాస్త హోమ్లీగా కనిపిచించినా కూడా, రెండో సినిమా నుండి గ్లామర్ గేట్లను ఎత్తేస్తుంటారు. తొలి సినిమాలో సింపుల్ గా ఉన్న సమంత, రష్మిక కూడా ఆ తరువాత సినిమాల్లో గ్లామర్ తో విరుచుకుపడ్డారు.
పూజా హెగ్డే కూడా మూడు సినిమా నుండి ఏకంగా బికినీ సొగసుల్లో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. అయితే తెలుగమ్మాయిల పరిస్థితి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉందిలే. ముందేమో నో-గ్లామర్ అంటారు, ఆఫర్లు పోతున్న సమయంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంటారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ లో మరో తెలుగు పిల్ల కూడా చేరింది.
ఈ మధ్యన చిన్న సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ తో, అలాగే ఇంకా చిన్న సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తూ.. వెబ్ సిరీసుల్లో క్యారక్టర్లు చేస్తూ.. సినిమాకు ఒక 10 లక్షలు పారితోషకం తీసుకునే రేంజుకు ఎదిగింది తెలుగు పిల్ల కోమలీ ప్రసాద్. అయితే మొదట్నుండీ ఈమె గ్లామర్ కు మాత్రం ఎస్ చెప్పలేదు.
ఇక నిధానంగా ఆమె ఇనస్టాగ్రామ్ ద్వారా గ్లామర్ డోసు పెంచుతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అది ఎక్కడ వరకు వచ్చిందంటే.. బికినీ బ్రాలు వేసుకుని పైన ఒక కోట్ కప్పుకుని.. కైపుగా కవ్విస్తోందీ బ్యూటి. అంటే తన గాళ్ నెక్ట్స్ డోర్ ముసుగు తీసేసి గ్లామర్ కు వత్తాసు పలకడానికి రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఈమె తరహాలో ఈ మధ్యన చాలామంది తెలుగు పిల్లలు రెచ్చిపోతున్నార్లే.
బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన వెంటనే గతంలో దివి కూడా ఎక్సపోజింగ్ చెయ్యనంది. తరువాత ఆఫర్లు రాకపోయేసరికి సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఆషు రెడ్డి అయితే బికినీల్లోకే దిగింది.
చిన్నాచితకా షార్ట్ ఫిలింస్ నుండి హీరోయిన్ స్థాయి వరకు వచ్చిన పూజిత పొన్నాడ కూడా మొదట్లో నో చెబుతూనే ఇప్పుడు మాత్రం లిప్ కిస్సింగ్ నుండి స్కిన్ షో వరకు అన్నింటికీ రెడీ అంటోంది. కొన్ని సినిమాల్లో అలాగే తళుక్కుమంది కూడా. ఈ మధ్యనే మరో తెలుగు పిల్ల చాందినీ చౌదరి కూడా గ్లామ్ డోస్ పెంచుదాం అనే డిసైడ్ చేసుకుంది.
కాని ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే.. భయంకరంగా గ్లామర్ డోస్ వడ్డించే పూజా హెగ్డే, రష్మిక వంటి భామలు రోజుకు గంటలు తరబడి జిమ్ లోనే ఉంటారు. ఆ వర్కవుట్స్ కారణంగా వారు నాజూకుగా సెక్సీగా కనిపిస్తుంటారు. మన భామలు మాత్రం ఎక్కడికక్కడ కాస్త షేపవుట్ అయినట్లే ఉన్నారు. ఏమన్నా అంటే బాడీ షేమింగ్ అంటారు కాని, ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే మాత్రం వయ్యారమైన కొలతలు ఉండాల్సిందే.
This post was last modified on August 3, 2022 2:12 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…