Movie News

బింబిసార డైరెక్ట‌ర్.. ఒక‌ప్ప‌టి హీరో

బింబిసార‌.. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ నిర్మించిన ఈ భారీ చిత్రం ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతోనే వ‌శిష్ఠ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక డెబ్యూ డైరెక్ట‌ర్ ఇంత భారీ సినిమా తీయ‌డం, అత‌ణ్ని న‌మ్మి క‌ళ్యాణ్ రామ్ భారీ బ‌డ్జెట్ పెట్ట‌డం టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఈ సినిమా ప్రోమోలు చూసిన వాళ్లంతా కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్.. ఈ కుర్రాడి గురించి ఇచ్చిన ఎలివేష‌న్, సినిమా గురించి చెప్పిన తీరు కూడా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఐతే మామూలు ప్రేక్ష‌కుల‌కు వ‌శిష్ఠ్ గురించి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కానీ.. ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు అత‌ను బాగానే ప‌రిచ‌యం. త‌న బ్యాగ్రౌండ్, ఇండ‌స్ట్రీలో త‌న జ‌ర్నీ ఆస‌క్తి రేకెత్తించేదే.

ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న వ‌శిష్ఠ్.. 15 ఏళ్ల కింద‌టే హీరోగా ఓ సినిమా చేయ‌డం విశేషం. ఆ సినిమా పేరు.. ప్రేమలేఖ రాశా. ఆ పేరుతో ఓ సినిమా ఉన్న‌ట్లు కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఢీ స‌హా కొన్ని సినిమాలను నిర్మించిన మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ కొడుకే వ‌శిష్ఠ్. అత‌డి అస‌లు పేరు మ‌ల్లిడి వేణు. ఈ పేరుతోనే హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. కానీ ఆ సినిమా వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.

త‌నకు న‌ట‌న సూట్ కాద‌ని ఫిక్స‌యి త‌ర్వాత దర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేశాడు. అత‌ను ఎన్నో ఏళ్ల ముందే ద‌ర్శ‌కుడు కావాల్సింది. ర‌వితేజ‌, అల్లు శిరీష్‌ల‌తో సినిమాలు ఓకే అయిన‌ట్లే అయి వెన‌క్కి వెళ్లిపోయాయి. శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు త‌ర్వాత పెద్ద బ‌డ్జెట్లో వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించాడు కూడా. కానీ బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల‌తోనే ఆ సినిమా ఆగిపోయింది. చివ‌రికి బింబిసార క‌థ‌తో అత‌ను క‌ళ్యాణ్ రామ్‌ను మెప్పించి ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

This post was last modified on August 3, 2022 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

12 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

50 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago