Movie News

దిల్ రాజు కష్టపడి సాధించుకున్నదంతా..

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఎక్కువ నెగెటివ్ న్యూస్‌తోనే వార్తల్లో నిలుస్తున్నారు. మంచి సక్సెస్ రేట్, క్రెడిబిలిటీ ఉన్న ఆయన్నుంచి ఇటీవల స్థాయికి తగ్గ సినిమాలు రావట్లేదు. బాక్సాఫీస్ దగ్గర వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాల గురించి ప్రమోషన్ల టైంలో దిల్ రాజు చెప్పే మాటలకు.. సినిమాలో విషయానికి అసలు పొంతన ఉండట్లేదు. ‘ఎఫ్-3’లో ఎంటర్టైన్మెంట్ గురించి ఒక రేంజిలో చెప్పగా.. చివరికి ఆ సినిమాలో వీక్ కంటెంట్ ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.

‘థాంక్యూ’ తన మనసుకు నచ్చిన కథ అని, ఇందులో ఎమోషన్‌కు ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయిపోతారని, సినిమా ప్రేక్షకులను వెంటాడుతుందని అని ఆయన చెప్పగా.. అలాంటి ఫీలింగ్ అసలే ఇవ్వలేదు. దిల్ రాజు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందీ సినిమా. మరోవైపు హిందీలో ఎంతో నమ్మకంతో రీమేక్ చేసిన ‘జెర్సీ’, ‘హిట్’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆయన బ్రాండ్ బాగా దెబ్బ తినేసింది.

మరోవైపు ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల విషయంలో దిల్ రాజు స్పందిస్తున్న తీరు.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. తన క్రెడిబిలిటీని దెబ్బ తీస్తున్నాయి. టికెట్ల ధరలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అంగీకరిస్తూ.. ‘ఎఫ్-3’ సినిమాకు టికెట్ల రేట్లు తగ్గించేస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటనలో డొల్లతనం అందరికీ అర్థమైంది. ఆ సినిమాకు అదనంగా రేట్లు పెంచలేదు తప్పితే.. ఎక్కువ రేట్లే పెట్టడం ప్రేక్షకులకు రుచించలేదు. ఇక ‘థాంక్యూ’ సినిమాకు సాధారణ రేట్ల కంటే తక్కువ ధరలు పెడుతున్నట్లు ప్రెస్ మీట్లో చెప్పి.. ఆ తర్వాత మాట మార్చేశారు. విలేకరులే తప్పుగా అర్థం చేసుకున్నారని నింద వాళ్ల మీదికి నెట్టేశారు. ఈ విషయంలో రాజు తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నారు.

ఇవన్నీ ఒకెత్తయితే.. షూటింగ్స్ ఆపే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు మరో ఎత్తు. సినిమాల నిర్మాణం భారంగా మారిన నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై చర్చించడానికి షూటింగ్స్ ఆపాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యుల్లో దిల్ రాజు ఒకరు. కానీ ఆయన ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ‘వారసుడు’ మూవీ షూటింగ్ మాత్రం ఆపట్లేదు. ఇది ద్విభాషా చిత్రం అని అందరికీ తెలుసు. కానీ రాజు మాత్రం అది తమిళ సినిమా కాబట్టి షూటింగ్స్ ఆపట్లేదంటూ చేసిన ప్రకటన ఏమాత్రం సహేతుకంగా అనిపించట్లేదు. ఇటు ఇండస్ట్రీ జనాల్లో, అటు ప్రేక్షకుల్లో ఈమాటలో క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బ తీసుకున్నారు రాజు. ఇలా వరుసగా ఆయన వ్యవహారం విమర్శలు తెచ్చిపెడుతూ ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరంతా పోతోంది.

This post was last modified on August 2, 2022 6:02 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

6 minutes ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

54 minutes ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago