మాములుగా సంక్రాంతి పండక్కు మన సినిమాలు పందెం కోళ్లలా తలపడటం దశాబ్దాలుగా జరుగుతున్నదే. బొమ్మలో విషయం కొంత అటుఇటు ఉన్నా ఫెస్టివల్ పుణ్యమాని నిర్మాతలు గట్టెక్కిన సందర్భాలు ఎన్నో. అయితే ఆ సీజన్ అందరికీ దొరకదు. స్టార్ హీరోలు కర్చీఫ్ వేశాక మిగిలినవాళ్లకు ఛాన్స్ ఉండదు.
ఇప్పుడా క్రేజ్ క్రమంగా దసరాకు వచ్చేలా ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవడంతో నాలుగైదు రోజులు సెలవులు వచ్చే ఏ నెలైనా సరే పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు విజయదశమి దానికి వేదికయ్యేలా ఉంది. ఇప్పటిదాకా దసరాను అఫీషియల్ గా లాక్ చేసుకున్నది నాగార్జున ది ఘోస్ట్ మాత్రమే. అక్టోబర్ 5 డేట్ తో ఆల్రెడీ చిన్న టీజర్ వదిలారు.
వచ్చే నెల నుంచి ప్రమోషన్లు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఫైనల్ స్టేజిలో ఉంది. చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా అదే తేదీకి వదిలితే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. కానీ నాగ్ చిరుల మధ్య స్నేహం దృష్ట్యా చూస్తే ఫేస్ టు ఫేస్ క్లాష్ అవ్వడం అనుమానమే. ఒకరు సెప్టెంబర్ చివరి వారం ఎంచుకోవచ్చు. కానీ అక్కడా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కాచుకుని ఉంది.
మరోవైపు మంచు విష్ణు జిన్నాను సైతం ఆ టైంకే ఫిక్స్ చేయాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదేమి భయపడే కాంపిటేషన్ కాకపోయినా ఆ ధైర్యం వెనుక కారణం కంటెంటేనా లేక మరేదైనా ఉందానేది తెలియాల్సి ఉంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న అన్నీ మంచి శకునములేని కూడా దసరాకే తెస్తారట. రెండు పెద్ద సినిమాలు రెండు మీడియం చిత్రాలు వెరసి పోటీ మంచి రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. ఇంకా రెండు నెలలు టైం ఉన్నప్పటికీ ఈ నలుగురు దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని వినికిడి
This post was last modified on August 1, 2022 6:59 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…