Movie News

ఆగస్టు ఆదుకుంటుందా?

వేసవి సీజన్ చివర్లో వచ్చిన ‘మేజర్’, ‘విక్రమ్’ చిత్రాల తర్వాత టాలీవుడ్‌కు మామూలు షాకులు తగల్లేదు. గత వారాంతంలో వచ్చిన డబ్బింగ్ మూవీ ‘విక్రాంత రోణ’ తప్పితే అన్నీ చేదు అనుభవమే మిగిల్చాయి. ‘విక్రాంత్ రోణ’ను ఒరిజినల్ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి గత ఎనిమిది వీకెండ్లలో టాలీవుడ్‌కు ఏ చిత్రం కూడా సంతోషాన్నివ్వలేదన్నట్లే.

వేసవిలో భారీ వసూళ్ల తర్వాత.. ఇలాంటి డ్రై రన్ ఊహంచనిదే. ముఖ్యంగా జులై నెల ఇచ్చిన షాకులు మామూలువి కావు. రవితేజ, గోపీచంద్, నాగచైతన్య, రామ్ లాంటి స్టార్ల గాలి తీసేశాయి వాళ్ల సినిమాలు. ఈ చేదు అనుభవాల తర్వాత టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్టు మీద నిలిచాయి.

ఈ నెలలో రాబోయే సినిమాలు కచ్చితంగా బాక్సాఫీస్‌కు మళ్లీ కళ తెస్తాయన్న ఆశలు కలుగుతున్నాయి. తొలి వారంలో రాబోతున్న సీతారామం, బింబిసార చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి. వీటికి మంచి బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ సినిమాలు హిట్టయి ఆగస్టుకు శుభారంభాన్ని అందిస్తే.. తర్వాతి వారానిిక రెండు ఆసక్తికర చిత్రాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.

అందులో నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మాస్ దృష్టిని ఆకర్షిస్తుంటే.. నిఖిల్ మూవీ ‘కార్తికేయ-2’ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్లో, థ్రిల్లర్ ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇవి రెండు కూడా కచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమాల్లాగే కనిపిస్తున్నాయి. ఇక ఆమిర్ ఖాన్ డబ్బింగ్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ చాలా మంచి కథతో తెరకెక్కిన సినిమా. ఇది హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కు రీమేక్ కాబట్టి మినిమం గ్యారెంటీ మూవీ అవుతుందన్న ఆశలున్నాయి. ఇందులో నాగచైతన్య ముఖ్య పాత్ర పోషించడం తెలుగు మార్కెట్‌లో సినిమాకు ప్లస్ అవుతుందేమో చూడాలి.

ఇక ఆగస్టు నెలలో భారీ అంచనాలున్న సినిమా అంటే.. ‘లైగర్’యే. ఈ సినిమా ప్రోమోలు అటు ఇటుగా ఉన్నప్పటికీ.. హైప్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ అయిన ఆగస్టు 25న మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయగలనని విజయ్ ధీమాగా ఉన్నాడు. వేసవిలో భారీ చిత్రాల సందడి ముగిశాక మళ్లీ ‘లైగర్’తోనే బాక్సాఫీస్‌ దగ్గర ఆ స్థాయి వేడి కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఆగస్టు సినిమాలు ట్రేడ్‌లో ఆశలు, అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈ నెల అయినా బాక్సాఫీస్ కళకళలాడుతుందేమో చూడాలి. 

This post was last modified on August 1, 2022 6:32 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago