Movie News

నిండా మునిగిన నిర్మాతకు రవితేజ హామీ

టాలీవుడ్లో పెద్ద పెద్ద నిర్మాతలకు కూడా ఈ మధ్య వరుసగా గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నవీన్-రవిశంకర్ (మైత్రీ).. ఇలా అందరూ చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు ఈ మధ్య కాలంలో. ఐతే వీళ్లు ఒక సినిమా పోతే ఇంకో సినిమాతో నష్టాన్ని భర్తీ చేసుకోగల సామర్థ్యం ఉన్నవాళ్లే. గతంలో వాళ్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలున్నాయి.

ఈ నష్టాలను తట్టుకోలేనంత చిన్న స్థాయి కాదు వాళ్లది. కానీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న వాళ్లకు మాత్రం వరుసగా పరాజయాలు ఎదురైతే ఎదుర్కోవడం తేలిక కాదు. సుధాకర్ చెరుకూరి అనే మంచి నిర్మాత కొన్నేళ్ల కిందట నిర్మాణంలోకి అడుగు పెట్టి వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఇప్పటికే పడి పడి లేచె మనసు, ఆడవాళ్ళు మీకు జోహార్లు, విరాటపర్వం చిత్రాలతో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆయనకు తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూపంలో ఇంకా పెద్ద షాక్ తగిలింది.

ఇంతకుముందు తీసిన సినిమాల్లో కొంత విషయం ఉంది. అవి ఆ నిర్మాత అభిరుచిని చాటాయి. కానీ ‘రామారావు’ అన్ని రకాలుగా నిరాశ పరిచింది. ఇలా వరుస పరాజయాలు ఎదురైతే మనుగడ సాగించడం కష్టమవుతుంది. బేనర్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో నానితో ఆయన చేస్తున్న ‘దసరా’ పరిస్థితి ఏమవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ముందు ‘రామారావు’ బయ్యర్లకు సెటిల్ చేయాల్సి ఉంటుంది. నష్టాలు మరీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయ్యర్లు వదలకపోవచ్చు.

ఐతే తన సినిమాతో ఆర్థికంగా బాగా దెబ్బ తిన్న సుధాకర్‌ను రవితేజ ఆదుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆయనకు ఇంకో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడట. తక్కువ పారితోషకం, బడ్జెట్లో సినిమా తీసి.. బయ్యర్లకు తక్కువకు ఇవ్వడం ద్వారా సెటిల్ చేయాలన్నది ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు పారితోషకం విషయంలో రవితేజ పేచీ పెట్టి నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. తీరా చూస్తే.. సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతను అదుకోవడానికి రవితేజ ముందుకు వచ్చాడన్నది తాజా వార్త.

This post was last modified on August 1, 2022 4:22 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

31 mins ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

2 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

5 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

5 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

5 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

6 hours ago