Movie News

దిల్ రాజు తన రూల్‌ను తనే బ్రేక్ చేస్తున్నాడా?

ఆగస్టు 1.. టాలీవుడ్ జనాలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తేదీ. ఈ రోజు నుంచి మొత్తం షూటింగ్స్ అన్నీ ఆపేయాలని వారం కిందట తెలుగు యాక్టివ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరిగిపోవడం, అదే సమయంలో థియేటర్ రెవెన్యూ దారుణంగా పడిపోవడంతో నిర్మాత పరిస్థితి దయనీయంగా మారిన నేపథ్యంలో కొన్ని దిద్దుబాటు చర్యలు చేపడితే తప్ప ప్రొడక్షన్ కొనసాగించడం అసాధ్యం అని భావిస్తున్న గిల్డ్.. షూటింగ్స్‌కు విరామం ఇచ్చింది.

నిర్మాతలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్మాణ వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టి ఆ తర్వాత చిత్రీకరణలు కొనసాగంచాలని నిర్ణయించారు. ఐతే అశ్వినీదత్ సహా కొందరు నిర్మాతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దత్ అయితే తన సినిమాల షూటింగ్స్ ఆపేది లేదని తేల్చి చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ కూడా షూటింగ్స్ అందరూ ఎందుకు ఆపాలని ప్రశ్నించారు. మరి సోమవారం నుంచి తెలుగులో ఏ షూటింగ్స్ ఆగుతాయి.. ఏవి కొనసాగుతాయి అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

ఐతే గిల్డ్‌లో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ.. అందులో తీసుకునే నిర్ణయాల్లో కీలకంగా ఉంటున్న దిల్ రాజే.. షూటింగ్స్ ఆపాలన్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న విజయ్ సినిమా ‘వారసుడు’ షూటింగ్‌ను ఆపకుండా సోమవారం కూడా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఈ సినిమా షెడ్యూల్ కొనసాగుతోందట.

ఇది తమిళ, తెలగుు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న సినిమా అన్న సంగతి తెలిసిందే. ఐతే దీన్ని తమిళ చిత్రంగా పేర్కొంటూ, షూటింగ్ ఆపాల్సింది తెలుగు చిత్రాల వరకే కాబట్టి దీనికి ఆ షరతు వర్తించదంటూ చిత్రీకరణ కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ ప్రచారమే నిజం అయితే.. ఎంతోమంది డేట్స్‌తో ముడిపడ్డ షూటింగ్ షెడ్యూళ్ల విషయంలో మిగతా నిర్మాతలు వెనక్కి తగ్గగా.. గిల్డ్‌లో కీలకంగా ఉంటున్న దిల్ రాజే ఏదో మెలిక పెట్టి ఈ రూల్‌ను బ్రేక్ చేయడం ఏమిటనే ప్రశ్న తలెత్తడం ఖాయం.

This post was last modified on August 1, 2022 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రాణాలు కాపాడుకుందామని రైలు నుంచి దూకితే.. మరో రైలు గుద్దేసింది

బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…

2 minutes ago

ఆ సినిమాల నుంచి నన్ను తీసేశారు – అక్షయ్

బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…

19 minutes ago

తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ

ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…

29 minutes ago

ఎంపీలో ఘోరం!… శోభనానికి ముందు కన్యత్వ పరీక్ష!

దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…

46 minutes ago

‘సిండికేట్’ : ఆర్జీవీ పాపాలను కడగనుందా?

రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…

51 minutes ago

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు.. భారత్ అభ్యంతరం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…

1 hour ago