ప్రస్తుతం తెలుగు చిత్ర నిర్మాతలు షూటింగులు బంద్ చేసి కొన్ని కీలక సమస్యల మీద చర్చలు జరపనున్నారు. అందులో మెయిన్ గా ఓటీటీ రిలీజ్ పై ఎక్కువ చర్చ ఉంది. రెండు వారాలకే ఓటీటీ లో కొత్త సినిమా వచ్చేయడంతో ప్రేక్షకులు థియేటర్ మొఖం చూడటం లేదు.
తాజాగా రిలీజైన కొత్త సినిమాల రెవెన్యూ మీద ఈ ఎఫెక్ట్ బాగా పడింది. దీంతో ఉన్నపళంగా మీటింగులు పెట్టుకొని షూటింగ్ బంద్ చేసి వీటన్నిటికీ పరిష్కారం చూడాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పది వారాల వరకూ కొత్త సినిమాలు ఓటీటీ కి ఇవ్వకూడదని ఓ మాట కూడా అనుకున్నారు.
కానీ ఆగస్ట్ లో రెండు కొత్త సినిమాలు ఓటీటీ కి వచ్చేస్తున్నాయి. రామ్ ‘వారియర్’ సినిమా ఆగస్ట్ 11న హాట్ స్టార్ లో రానుందని ప్రచారం జరుగుతుంది ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ ఈ డేట్ దాదాపు ఫిక్స్ అంటున్నారు.
ఇక గోపీచంద్ -మారుతి కాంబినేషన్ లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ సినిమా ఆగస్ట్ 5న ఆహాలో రాబోతుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు నిర్మాత బన్నీ వాస్ మా సినిమా ఇప్పుడే ఓటీటీలో రాదని కచ్చితంగా యాబై రోజుల తర్వాతే అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు. తీరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టడంతో ఇప్పుడు మాట తప్పాడు.
ఇక రామ్ ‘వారియర్’ కూడా యాబై రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ డేట్ ని కాస్త ముందుకు తీసుకురాబోతున్నారు. ఒక పక్క టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యుసర్ గిల్డ్ ఓటీటీ రిలీజ్ గురించి చర్చించుకుంటూ ఉండగా మరో వైపు ఓటీటీ సంస్థలు కొత్త సినిమాలను ఎనౌన్స్ చేసేస్తున్నారు.
మరి ఇకపై అయినా నిర్మాతలు ఇలా మాట తప్పకుండా ఎఫ్ 3 లా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటే థియేటర్స్ వ్యవస్థ కొంతలో కొంత చక్కబడుతుంది. జనాలు థియేటర్స్ కే మొగ్గు చూపుతారు. లేదంటే ఇక థియేటర్స్ మనుగడ కష్టమవుతుంది.
This post was last modified on August 1, 2022 1:11 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…