టాలీవుడ్ లో కొన్ని కథలు ముందుగా వేరే హీరోల దగ్గరికి వెళ్లి ఫైనల్ గా ఓ హీరో చేతిలో పడతాయి. అలా హీరోలు మారిన వాళ్ళు రిజక్ట్ చేసి ఇంకో హీరో దగ్గరికి వెళ్ళిన సినేమలెన్నో ఉన్నాయి. తాజాగా రామరావు ఆన్ డ్యూటీ విషయంలోనూ అదే జరిగింది.
ఈ కథతో కొన్నేళ్లుగా ట్రావెల్ చేస్తున్న దర్శకుడు శరత్ మండవ ఈ స్క్రిప్ట్ ను ముందుగా నాగార్జున కి చెప్పాడు. కామాక్షి మూవీ అధినేత , నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి ద్వారా నాగ్ ని అప్రోచ్ అయి కథ వినిపించాడు శరత్. ఈ విషయాన్ని ఇటివలే ఓ ఇంటర్వ్యూలో తనే చెప్పుకున్నాడు కూడా.
అయితే నాగార్జున అప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని , పైగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది… ఎవరైనా యంగ్ గా కనిపించే హీరో అయితే బెటర్ అని సజిస్ట్ చేశాడని తన వర్షన్ చెప్పుకున్నాడు. అయితే దీని బ్యాకెండ్ స్టోరీ ఏంటంటే నాగ్ ఈ కథను రిజెక్ట్ చేశాడట.
కేరెక్టర్ బాగుంది కానీ మాజీ ప్రేయసి కోసం తను ఓ కేసు చేధించడం లేదని సుముకంగానే చెప్పేశాడట. ఇక చేసేదేం లేక అప్పటి నుండి హీరో కోసం చూస్తూ ఫైనల్ గా ఈ కథను రవితేజ దగ్గరికి తీసుకెళ్ళి తన స్నేహితుడు సుధాకర్ రెడ్డి బేనర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడట.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ టాక్ విని నాగార్జున తన జడ్జిమెంట్ గురించి తన శ్రేయాభిలాషుల దగ్గర మాట్లాడారని భోగట్టా. ఏదేమైనా ముందుగా నాగార్జున కి ఈ కథ చెప్పానని శరత్ చెప్పింది విన్న అక్కినేని ఫ్యాన్స్ సినిమా చూసి హమ్మయ్య మా హీరోకి ఓ డిజాస్టర్ తప్పింది అనుకుంటున్నారు.
ఏదేమైనా రామారావు ఆన్ డ్యూటీ మరీ తీసి పారేసే కథ మాత్రం కాదు. శరత్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా సరిగ్గా టేకాఫ్ చేయలేకపోయాడనే విమర్శలు అందుకుంటున్నాడు.
This post was last modified on August 1, 2022 9:02 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…