ఎనిమిదేళ్ల కిందట వచ్చిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా ఇప్పుడు కార్తికేయ-2 రాబోతోంది. కార్తికేయ రిలీజై సూపర్ హిట్టయినపుడే ఆ చిత్రానికి సీక్వెల్ తీస్తానని దర్శకుడు చందు మొండేటి సంకేతాలు ఇచ్చాడు. ఐతే వేరే కమిట్మెంట్ల వల్ల, ఏవో కారణాల వల్ల ఈ సినిమా బాగా ఆలస్యం అయింది.
చివరికి సినిమా మొదలు పెట్టాక కరోనా కారణంగా మరింత ఆలస్యం తప్పలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలోకి దిగబోతోంది. ఐతే ఈ సినిమా పక్కా సీక్వెలా లేక ఎఫ్-3 తరహా ఫ్రాంఛైజీ చిత్రమా అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి.
సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే కథ కొనసాగుతుంది. ఫ్రాంఛైజీ సినిమా అంటే పాత్రలు తీసుకుని కొత్త కథతో తీస్తారు. ఐతే కార్తికేయ-2 పక్కా సీక్వెల్ అని హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
కార్తికేయలో హీరో ఒక పెద్ద సమస్యను పరిష్కరించాక మెడికల్ డిగ్రీ తీసుకోవడంతో కథ ముగుస్తుందని.. ఆ తర్వాత మూడేళ్లకు ఆ హీరో పీజీలో చేరి ఒక ఆసుపత్రిలో పని చేస్తున్న సమయంలో కార్తికేయ-2 మొదలవుతుందని అతను వెల్లడించాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు.. వాటిని పరిష్కరించడానికి అతను చేసే ప్రయత్నమే ఈ చిత్రం అని నిఖిల్ తెలిపాడు.
కాగా ఇది సీక్వెల్ అయినపుడు ఫస్ట్ పార్ట్‌లో నిఖిల్‌కు జోడీగా నటించిన స్వాతి పాత్ర సంగతేంటి అనే ప్రశ్న ఎదురవగా.. దానికి నర్మగర్భమైన సమాధానం చెప్పాడు నిఖిల్. కార్తికేయ-2లో స్వాతి పాత్ర ప్రస్తావన ఉంటుందని.. కథలో ఆ పాత్ర కూడా భాగమే అని.. ఐతే ఇందులో స్వాతి ఉందా లేదా అన్నది తెర మీదే చూడాలని అతను చెప్పాడు.
స్వాతినే కథానాయికగా కొనసాగించాలన్న చర్చ వచ్చినప్పటికీ.. ఈ కథ తెలుగు ప్రాంతాన్ని దాటి ద్వారక, హిమాచల్ ప్రదేశ్.. ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుగుతుందని, అక్కడ హీరో కలిసే కొత్త అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్‌ను తీసుకున్నామని నిఖిల్ వెల్లడించాడు.
This post was last modified on August 1, 2022 9:04 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…