ఇస్మార్ట్ శంకర్ కి ముందు వరకూ చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో రొమాంటిక్ సినిమాలు చేసిన రామ్ పోతినేని పూరి చేతిలో పడి తనలో ఉన్న మాస్ ని బయటపెట్టాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మాస్ హీరోల లిస్టులో ఈజీగా చేరిపోయాడు రాం. ఆ వెంటనే రెడ్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేశాడు సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఆ సినిమా మోస్తరుగా ఆడింది కానీ నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది.
దీంతో రామ్ చాలా టైం తీసుకొని కోలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాలతో ఒకప్పుడు హిట్స్ అందుకున్న లింగుస్వామితో ‘వారియర్’ సినిమా చేశాడు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు రామ్ కి హిట్ ఇవ్వాల్సిన భారం బోయపాటి పై పడింది.
రామ్ నెక్స్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. వారియర్ నిర్మాతే దీన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిర్మాత శ్రీనివాస్ చిత్తూరికి కూడా హిట్ ఇవ్వాల్సిన భాద్యత బోయపాటి పై పడింది. సీటిమార్ , వారియర్ ఎఫెక్ట్ తో ఆయన కొంత నష్టాల్లో ఉన్నారు. ఈ సినిమానే తనని మళ్ళీ గట్టెక్కిస్తుందని భావిస్తున్నాడు.
ఇక రామ్ మాత్రం బోయపాటి ప్రాజెక్ట్ మీదే నమ్మకం పెట్టుకున్నాడు. టాలీవుడ్ లో ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన బోయపాటి శ్రీను తనకి సాలిడ్ హిట్ ఇచ్చి మరింత మాస్ గా ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నాడు. మరి పూరిలా బోయపాటి రామ్ కి ఓ సాలిడ్ మాస్ హిట్ ఇవ్వగలిగితే ఇక కుర్ర హీరో కొన్నేళ్ళు నిలబడిపోతాడు.
This post was last modified on July 31, 2022 9:41 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…