ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ యాడ్స్ తో నిత్యం బిజీగా ఉండే స్టార్ హీరో ఎవరంటే టక్కున వినిపించే పేరు మహేష్ బాబు. అవును మహేష్ చేసినన్ని యాడ్స్ ఇంకెవరు చేయలేదు. తనకున్న ఫాలోయింగ్ వచ్చిన యాడ్ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి రెమ్యునరేషన్స్ అందుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు మహేష్ రూట్లోనే బన్నీ కూడా వెళ్తున్నాడు. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత జోమోటో యాడ్ తో పాటు శ్రీ చైతన్య యాడ్ చేసిన బన్నీ తాజాగా ఆస్ట్రాల్ పైప్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.
ఇటివలే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆస్ట్రాల్ పైప్స్ యాడ్ షూట్ చేశాడు బన్నీ. ఈ యాడ్ కోసం డిఫరెంట్ గెటప్ ట్రై చేసి హాట్ టాపిక్ గా మారాడు. హరీష్ శంకర్ కూడా ఈ యాడ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఎలాంటి యాడ్ చేశారు ? బన్నీ ఇందులో బ్రాండ్ గురించి ఏం చెప్పనున్నాడు అనేది ఆసక్తి రేకెత్తిస్తుంది.
నిజానికి పుష్ప తర్వాత అల్లు అర్జున్ కి వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిపోయాడు. దీంతో బన్నీ ని వెతుక్కుంటూ చాలా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని అప్రోచ్ అవుతున్నారట. అందులో బన్నీ కొన్ని మాత్రమే ఎంచుకొని ఒకటి తర్వాత మరొకటి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఏదేమైనా పుష్ప క్రేజ్ ని బన్నీ పర్ఫెక్ట్ గా వాడుకుంటూ కమర్షియల్ గా మంచి డబ్బు సంపాదించుకుంటున్నాడు. మరి పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ డబుల్ అయితే మరిన్ని కమర్షియల్ యాడ్స్ లో కనిపించడం ఖాయం.
This post was last modified on July 31, 2022 9:39 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…